close
Choose your channels

Supreme Court:ఎన్నికల ప్రక్రియ పాదర్శకంగా ఉండాలి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Thursday, April 18, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఈ ఎన్నికల పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలను ఉపయోగించనుంది. దీంతో ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు ఈవీఎంలపై పలు అనుమాలను వ్యక్తం చేస్తున్నాయి. వీవీప్యాట్, ఈవీఎంలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా దేశంలో ఎన్నికల ప్రక్రియపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించాల్సిన అసరముందని ఎన్నికల సంఘానికి తేల్చి చెప్పింది.

ఈ సందర్భంగా వీవీప్యాట్ స్లిప్స్‌ని ఈవీఎమ్‌తో ఎలా వెరిఫై చేస్తారో వివరంగా చెప్పాలని ఈసీని ఆదేశించింది. వీవీప్యాట్‌తో వేసిన ఓట్లను ఈవీఎంలతో పూర్తి స్థాయిలో క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరముందని తేల్చి చెప్పింది. ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరిగిందో లేదో తెలసుకోడానికి ఉపయోగపడే ఈ ఓట్ వెరిఫికేషన్ సిస్టమ్‌పై దృష్టి పెట్టాలని వెల్లడించింది. పిటిషనర్‌ల తరపున వాదించిన అడ్వకేట్ నిజాం పాషా.. ఓటింగ్ పూర్తైన తరవాత వీవీ ప్యాట్ స్లిప్‌ని ఓటర్‌ తనతో పాటు తీసుకెళ్లేలా వెసులుబాటు కల్పించాలని కోరారు. అంతే కాదు ఈ విధానం కేవలం 5 ఈవీఎమ్‌లకే పరిమితం కాకుండా 100% వెరిఫికేషన్ చేయాలని వాదించారు.

ఇక అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తరపున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. కేరళలోని కసర్‌గడ్‌లో జరిగిన మాక్‌ పోలింగ్‌ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాలుగు ఈవీఎమ్‌లను వీవీప్యాట్‌లతో పోల్చి చూస్తే బీజేపీకి అదనపు ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఈ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియ సమర్థంగా జరిగేలా చూసుకోవాలని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం లేదన్న అనుమానాలు ఎవరికీ కలగకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది.

అంతే కాదు ఎన్నికలను పారదర్శకంగా ఎలా నిర్వహిస్తారో పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే వీవీప్యాట్‌ ప్రింటర్‌లో ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉంటుందా అని ప్రశ్నించగా.. ఎన్నికల గుర్తుల్ని స్టోర్ చేసుకునే విధంగా 4MB ఫ్లాష్ మెమరీ ఉంటుందని ఈసీ వెల్లడించింది. కాగా ప్రస్తుతానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ర్యాండమ్‌గా 5 ఈవీఎమ్‌లను ఎంపిక చేసుకుని వీవీ ప్యాట్ వెరిఫికేషన్ చేపడుతున్నారు. చాలా రోజులుగా దీనిపై వివాదం కొనసాగుతోంది. ప్రతి ఓటును వెరిఫికేషన్ చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.