close
Choose your channels

హాట్ భామ సీక్రెట్ పెళ్లి.. 4 కోట్లివ్వాలని మాజీ ప్రియుడు డిమాండ్

Tuesday, August 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హాట్ భామ సీక్రెట్ పెళ్లి.. 4 కోట్లివ్వాలని మాజీ ప్రియుడు డిమాండ్

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్.. ఎన్నారై రితీశ్‌ను వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే ఈ తంతు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరిగింది. మొదట అందరూ ఇది రియల్ పెళ్లి కాదని.. రీల్ పెళ్లి అని భావించారు. అయితే నిజంగా ఇది పెళ్లని తెలిసిన తర్వాత ఈమె వీరాభిమానులు, మాజీ ప్రియుడు కంగుతిన్నారు. ప్రస్తుతానికి తాను కూడా అమెరికాకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నానని.. మంచి కథ వస్తే కచ్చితంగా మళ్లీ నటిస్తానని ఈ ముదురు భామ చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా రాఖీ మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ రియాక్టయ్యాడు.

నీ జీవితాన్ని నాశనం చేస్తా!
తనను పెళ్లి చేసుకుంటానని పలుమార్లు చెప్పిన రాఖీ.. అన్యాయం చేసిందంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు. అంతేకాదు.. ఇలా తనను మోసం చేసినందుకు గాను రాఖీ తనకు రూ. 4 కోట్లు ఇచ్చి తీరాల్సిందేనని.. ఆ డబ్బులు నాలుగు రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే.. ఆమె జీవితాన్ని నాశనం చేస్తానని బ్యాక్ మెయిల్‌కు దిగాడు.

రాఖీ రియాక్షన్!
దీపక్ వ్యాఖ్యలకు రాఖీ సావంత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తనపై, తన భర్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావని.. ఇది పద్ధతి కాదని హితవు పలికింది. అంతేకాదు తననేం చేయలేవ్.. అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వరుస వీడియోలను షేర్ చేసింది. ఇంకొక సారి ఇలా తమ గురించి చెడుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించింది. మరి ఈ డబ్బుల వ్యవహారం, రాఖీ పెళ్లి వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.