close
Choose your channels

రాంచరణ్ మూవీకి ఫాహద్ ఫాసిల్ ఫిదా!

Wednesday, July 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాంచరణ్ మూవీకి ఫాహద్ ఫాసిల్ ఫిదా!

దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా అద్భుతమైన చిత్రాలు ఇక్కడ తెరకెక్కుతున్నాయి. బాహుబలితో మొదలైన ఈ పరంపర కొనసాగుతోంది. అర్జున్ రెడ్డి, రంగస్థలం, జెర్సీ లాంటి చిత్రాలు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: రాజమౌళి RRRకి అనిరుధ్ జోష్.. కిక్కు పెంచడానికే..

మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కు రంగస్థలం మూవీ తెగ నచ్చేసిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ ఈ విషయాన్ని రివీల్ చేశారు. 'సుకుమార్ నాకు పుష్ప కథ నేరేట్ చేసినప్పుడు రంగస్థలం చూశాను. చాలా బాగా నచ్చింది. కథ చాలా ఫ్రెష్ గా అనిపించింది. అలాంటి రోల్ నేను ఇంతవరకు చేయలేదు' అని ఫాహద్ అన్నారు.

రాంచరణ్ మూవీకి ఫాహద్ ఫాసిల్ ఫిదా!

సుకుమార్ దర్శత్వంలో రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం మాస్టర్ పీస్ గా నిలిచింది. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా ఫాహద్ ఫాసిల్ ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఫాహద్ ఫాసిల్ ఇంకా పుష్ప షూట్ లో జాయిన్ కాలేదు. పుష్ప షెడ్యూల్ మొత్తం లాక్ డౌన్ వల్ల డిస్టర్బ్ అయింది. ఆగష్టు లో తాను షూట్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఫాహద్ వివరించాడు.

రాంచరణ్ మూవీకి ఫాహద్ ఫాసిల్ ఫిదా!

ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.