close
Choose your channels

'ఫ్యామిలీ ప్యాక్' మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్

Saturday, June 27, 2020 • తెలుగు Comments

ఫ్యామిలీ ప్యాక్ మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా మారి పి.ఆర్.కె ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కొంత టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.ఇప్పుడు ఆ కోవలోకే తన ఐదో సినిమాగా ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

లిఖిత్ శెట్టి,అమృత అయ్యంగార్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ గా ఉన్న ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. కన్నడ సినిమా నే అయినా మేకర్స్ ఇతర రీజనల్ లాంగ్వేజ్ లోనూ ప్రమోట్ చేయడం విశేషం.డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా ప్రమోషన్ రూపమే మారిపోయిందని చెప్పాలి. ఎక్కడ ఏ సినిమా ఫస్ట్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైనా కానీ ఆన్ లైన్ లో ప్రమోట్ చేయటం ద్వారా అందరికీ తెలుస్తుంది. అందుకే ‘‘ఫ్యామిలీ ప్యాక్’’ మోషన్ పోస్టర్ అందరికీ రీచ్ అయింది.తెలుగు నుండి ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం అప్పుడే ఆ చిత్ర నిర్మాత పునీత్ రాజ్ కుమార్ ను సంప్రదించారట.అంతే కాదు ఈ మూవీ డిజిటర్ రైట్స్ కోసం కూడా ప్రముఖ డిజిటల్ యాప్ తో చర్చలు జరుగుతుండటం విశేషం.కేవలం ఒకే ఒక్క ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఇంత హైప్ రావడం గమనార్హం.

పునీత్ రాజ్ కుమార్ సమర్పణలో అశ్వినీ పునీత్ రాజ్ కుమార్ ,లిఖిత్ శెట్టి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీని ఎస్.అర్జున్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. పునీత్ రాజ్ కుమార్ నిర్మించిన ఇంకో సినిమ ‘‘లా’’ డైరెక్ట్ గా అమెజాన్ లో జులై 17న రిలీజ్ కాబోతుంది.

Get Breaking News Alerts From IndiaGlitz