close
Choose your channels

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

Monday, January 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

రాష్ట్రంలో ఎన్నికల కురుక్షేత్రం మొదలైంది. ఓవైపు పాండవ సైన్యం.. మరోవైపు కౌరవుల సైన్యం మధ్య యుద్ధం జరగనుంది. పాండవుల సైన్యానికి అర్జునుడిలా సీఎం జగన్‌ వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కౌరవ సైన్యం తరపున చంద్రబాబు, పవన్, షర్మిల వంటి నేతలు బరిలో దిగుతున్నారు. కానీ విజయం శ్రీకృష్ణుడి లాంటి ప్రజలు అండగా ఉన్న జగన్‌నే వరించడం ఖాయమని అర్థమైపోయింది. ఎందుకంటే గత రెండ్రోజులుగా జరుగుతున్న చంద్రబాబు సభలకు జనమే కరువయ్యారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా.. మరో 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న రాష్ట్రంలోనే పెద్ద నేతగా పేరున్న చంద్రబాబు సభలకు జనం రావడం లేదంటే టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

రమ్మంటున్నా రానంటున్న ప్రజలు..

రా.. కదలిరా పేరుతో శనివారం పీలేరు, ఉరవకొండలో సభలకు ప్రజలే కరువయ్యారు. స్థానికులెవరూ ఆ సభలు వైపే కన్నెత్తి చూడలేదు. దీంతో పరువు పోతుందని భావించిన పసుపు నేతలు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి ఏసీ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. అలాగే రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె తదితర ప్రాంతాల నుంచి సైతం భవన నిర్మాణ కూలీలను తీసుకొచ్చారు. నగదు ఇచ్చి మరీ తీసుకొచ్చినా జనం తక్కువగానే హాజరయ్యారు. ఆ వచ్చిన కొద్దిమందిలో కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే తిరిగి వెళ్లిపోయారు.

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

జగన్ సభకు జనసముద్రం..

ఇక అదే శనివారం భీమిలిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరైన సభకు ఓవైపు సముద్రం ఉంటే.. మరోవైపు జనసముద్రంలా ప్రజలు తరలివచ్చారు. జగన్ చేసిన ప్రసంగానికి ఆద్యంతం కార్యకర్తల నుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ క్యాడర్‌లో ఫుల్ జోష్‌ నెలకొంది. ఆ జనాన్ని చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయింది. మన గెలుపు కష్టమే అని డిసైడ్ అయిపోయారు. అయినా కానీ నామమాత్రంగా చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నెల్లూరు , పత్తికొండలో జరిగిన సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తున్నా పెద్దగా స్పందన లేకపోయింది.

జగన్ సభలు కళకళ.. చంద్రబాబు సభలు వెలవెల..

బాబు సభకు ముఖం చాటేస్తున్న జనం..

బాబు చేస్తున్న రొటీన్ ప్రసంగాలు భరించలేక ప్రజలు అయన మాట్లాడుతుండగానే వెళ్లిపోతున్నారు. దీంతో ప్రజలను నిలువరించడానికి కార్యకర్తలు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు అదే రోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర నాయకులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరులో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం భారీగా హాజరయ్యారు. ఎమ్మెల్యే స్థాయి వైసీపీ నాయకులు హాజరైన సభలకే జనం భారీగా వస్తుంటే.. కానీ సీఎంగా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు సభలకు మాత్రం జనం ముఖం చాటేస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.