close
Choose your channels

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

Sunday, October 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

బుట్టబొమ్మ సాంగ్‌తో హోస్ట్ నాగార్జున కూల్ కూల్‌గా వచ్చారు. కానీ ఒక్కొక్కరిపై కొరడా ఝుళిపించారు. పేరు పేరునా వాయించి వదిలిపెట్టారు. ముందుగా నాగ్ క్రితం రోజు ఏం జరిగిందో చూశారు. నిన్న బిగ్‌బాస్ నిద్ర పోతున్న వారందరినీ లేపి లివింగ్ రూమ్‌లోకి రమ్మని చెప్పారు. ఇంటి నియమాలు పాటించడంలో అంతా విఫలమయ్యారని తెలిపారు. కెప్టెన్లు తమ కర్తవ్యాన్ని మరిచారని హెచ్చరించారు. ఇంట్లోని పరిసరాలన్నింటినీ శుభ్రం చేయకపోవడం వంటివి చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఎవరు నిబంధనను ఉల్లంఘించినా కెప్టెన్ సొహైల్ వెళ్లి అన్ని కెమెరాల దగ్గరకెళ్లి క్షమాపణ కోరాలని బిగ్‌బాస్ చెప్పారు. నిన్న జరిగింది చూస్తుంటే.. మళ్లీ ట్రయాంగిల్ స్టార్ట్ అయ్యిందా? అనిపించింది. కానీ అఖిల్ మాత్రం మోనాల్‌ని బెస్ట్ ఫ్రెండ్‌గా చెప్పడం విశేషం.. ఒప్పో ఎఫ్ 17 టాస్క్ పూర్తైంది. తరువాత నాగ్ కంటెస్టెంట్ల ముందుకు వెళ్లారు. సొహైల్‌కి కంగ్రాట్స్ చెప్పిన అనంతరం.. అఖిల్, అభిలతో పంచాయతీ స్టార్ట్ చేశారు. మోనాల్‌ను మధ్యలోకి ఎందుకు తీసుకు వచ్చారని వాయించారు. అందరికీ నాగ్ చెప్పారు.. ఎవరు ఎవరినైనా నామినేట్ చేసుకోవాలని కానీ.. మధ్యలోకి వేరే ఏ వ్యక్తినైనా తీసుకు రావాలంటే వాళ్ల పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. ఇంకోసారి అలా చేస్తే కొరడా ఝుళిపిస్తానని నాగ్ చెప్పారు.

తరువాత మోనాల్‌ని అఖిల్, అభిలలో ఎవరిది తప్పని అడగ్గా.. ఇద్దరిదీ తప్పేనన్నారు. మోనాల్‌తో ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. మోనాల్ తనతో అఖిల్‌ది తప్పని చెప్పిందని అభి చెప్పాడు. తరువాత నోయెల్‌ని స్వాతిని అమ్మ రాజశేఖర్ నామినేట్ చేశారని చెప్పి నామినేట్ చేశావు. మరి కుమార్ సాయిని నువ్వు నామినేట్ చేశావు కదా.. అప్పుడు నీకది గుర్తు రాలేదా? అని అడిగారు. తరువాత అమ్మ రాజశేఖర్‌ని నోయెల్ వచ్చి సారీ చెబుతుంటే ఎందుకసలు వినడానికి కూడా ఇష్టపడలేదని ప్రశ్నించారు. అమ్మ రాజశేఖర్ చెబుతుంటే నాగ్ వినలేదు. ఇప్పుడు మీకు ఎలా అనిపించిందని లాజికల్‌గా అడిగారు. నెక్ట్స్ సొహైల్ వంతు.. దివిపై అరుపేంటి? ఆ పిచ్ ఏంటి? ఒక పిచ్చి కుక్కలా అరుస్తున్నాడనిపిస్తోందంటూ వాయించేశారు. ఒక ఆడపిల్లపై అరుస్తున్నావని.. ఇంకొక్కసారి ఆడపిల్లపై అరుస్తే కొరడా ఝుళిపించాల్సి వస్తుందంటూ నాగ్ హెచ్చరించారు. తరువాత అవినాష్ వంతు.. దివి నడకను ఇమిటేట్ మరోసారి ఇమిటేట్ చేసి చూపించామని కోరగా చూపించాడు. నీ సీక్రెట్ టాస్క్ సక్సెస్ చేసుకోవడం కోసం మిగతా వారిని బలి చేస్తావా? అంటూ ఫన్నీగా అడిగారు. అవినాష్‌కి హాట్సాఫ్ చెప్పారు.

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

ఇక ఆట ఆగిపోవడానికి కారణం అభిజిత్ అని నాగ్ చెప్పారు. సర్వీస్ చేసి స్టార్స్ తీసుకోవాలని బిగ్‌బాస్ క్లియర్‌గా చెప్పారని.. మీరు ఓడిపోవడానికి కారణం హారిక అని నాగ్ చెప్పారు. టీమ్ వర్క్ చేయలేదని అందుకే ఓడిపోయారని నాగ్ చెప్పారు. మాట్లాడితే నీ ఎడ్యుకేషన్ తీస్తున్నావని.. ఎడ్యుకేషన్ లేని వాళ్లు ప్రపంచాన్ని రూల్ చేస్తున్నారని.. అసలు చదువు అనే దాన్ని మనసు నుంచి తీసేయాలని, అది వాడొద్దని నాగ్ చెప్పారు. మెహబూబ్ వంతు.. పుచ్చె పగిలిపోతుందా? ఏం మాట అది? అని ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. లాంగ్వేజ్ మార్చుకోమని చెప్పారు. ఇక నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిని నిలబెట్టారు. 8 కోట్ల ఓట్లు వచ్చాయని చెప్పారు. తరువాత సొహైల్‌ని నామినేషన్ నుంచి సేఫ్ చేశారు. తరువాత గంగవ్వ రిపోర్ట్స్ చూసి ఆమె ఆరోగ్యం బాగుండటం లేదని చెప్పారు. అయితే ఆమె అనారోగ్యానికి సంబంధించిన వీడియోలను ప్లే చేసి చూపించారు. గంగవ్వతో నాగ్ మాట్లాడారు. ఇల్లు లేదని వచ్చానని చెప్పింది. గంగవ్వను ఊరుకి పంపించేందుకు పర్మిషన్ ఇవ్వాలని నాగ్ కోరారు.

ఇంటికెళ్లిపోయిన గంగవ్వ .. కంటెస్టెంట్లను వాయించేసిన నాగ్..

గంగవ్వ కంటెస్టెంట్ల గురించి చెప్పింది. హారిక అప్పుడే బటర్ ఫ్లై కిస్ ఇస్తుందని.. అప్పుడే సీరియస్ అవుతుందని చెప్పింది. దివి గురించి చాలా బాగా చెప్పింది. సొహైల్ నాగు పాములా ఉంటాడని చెప్పింది. అఖిల్ గురించి చాలా మంచివాడని చెప్పింది. అమ్మ రాజశేఖర్ హౌస్‌లో ఉండాలని చెప్పింది. మోనాల్ మంచి పిల్ల అని చెప్పింది. నోయెల్ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని చెప్పింది. లాస్య తన పెద్ద బిడ్డతో అన్నం తిన్నట్టేనని చెప్పింది. సుజాత గురించి ఫన్నీగా చెప్పింది. అభి అందరితో మంచిగా ఉండు అని చెప్పింది. అరియానా చూడటానికి చిన్నదని.. కానీ మంచిదని ఏదైనా మొహం మీదే అనేస్తుందని చెప్పింది. అవినాష్.. గురించి అందరినీ నవ్విస్తాడని చెప్పింది. మెహబూబ్, కుమార్ సాయిల గురించి కూడా పాజిటివ్‌గానే చెప్పింది. మీ ఇల్లు అయ్యేలా నేను చూస్తానని నాగ్ హామీ ఇచ్చారు. అఖిల్‌ని గంగవ్వ సేఫ్ చేసింది. రేపు మరో కంటెస్టెంట్‌ని బిగ్‌బాస్ ఇంటికి పంపించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.