close
Choose your channels

వరల్డ్ వైడ్ గా 100 థియేటర్స్ లో 'గౌతమిపుత్ర' శాతకర్ణి ట్రైలర్

Thursday, October 27, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఇటీవ‌ల‌విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌ను 2.6 మిలియ‌న్స్ ఆడియెన్స్ వీక్షించారు. ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి భారీ ఎత్తున్న స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళేలా ప్లాన్ చేసిన నిర్మాత‌లు సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను యు.ఎస్‌., యు.కె. స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో ఒకేసారి విడుల‌య్యేలా ప్లాన్ చేశారు. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ వేడుక‌ను గ్రాండ్ లెవ‌ల్లో పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.