close
Choose your channels

Ram Charan:జీ 20 సదస్సుకు గెస్ట్‌గా రామ్‌చరణ్.. శ్రీనగర్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా, ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో గ్లోబల్ స్టార్

Monday, May 22, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ కావడం, దానికి ఆస్కార్ అవార్డ్ లభించడం తదితర కారణాలతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్టార్‌డమ్ శిఖరాగ్రాన్ని చేరుకుంది. నిన్న గాక మొన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొని తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు చరణ్. తాజాగా ఆయనకు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగే ‘‘జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్’’లో పాల్గొనాల్సిందిగా రామ్ చరణ్‌కు ఆహ్వానం అందింది. మే 22 నుంచి మే 24 వరకు మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లో ఈ స్థాయి సమావేశం జరుగుతోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను రామ్ చరణ్ సోమవారం ఉదయం శ్రీనగర్ బయల్దేరి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయంలో మీడియా కళ్లకు చిక్కారు చెర్రీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ రాంచరణ్ మిలటరీ క్యాప్ ధరించి.. బ్లాక్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్‌లో స్టైలిష్ లుక్‌లో అదిరిపోయారు. ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు భారతదేశంలో ఫిల్మ్ టూరిజం పరంగా అత్యంత కీలకమైనవి. ఫిల్మ్ టూరిజం విధానంపై జరిగే చర్చలో ధఱ్మ, నెట్‌ఫ్లిక్స్, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొంటారు. సమావేశాల చివరి రోజున అతిథులందరూ పోలో వ్యూ, జీలం రివర్ ఫ్రంట్‌తో పాటు శ్రీనగర్‌లోని ఇతర ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.

కనీవినీ ఎరుగని భద్రత :

జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. సమావేశాలు జరిగే వేదిక చుట్టూ మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌జీ, మార్కోస్ కమాండోలతో పాటు జమ్మూకాశ్మీర్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఆ ప్రాంతాన్ని డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి వేదిక వెళ్లే మార్గంలో జీ20 లోగోలను ఏర్పాటు చేశారు.

ఈ ఏడాది జీ20కి భారత్ అధ్యక్షత:

ఈ ఏడాది జీ 20కి భారత్ అధ్యక్షత వహించనుంది. రోస్టర్ చైర్ ప్రకారం ప్రధాని మోడీ ఏడాది పాటు జీ 20 అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ గ్రూప్‌లో అమెరికా, రష్యా, జపాన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి శక్తివంతమైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో వున్న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ఏడాది సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల నిర్వహణ ద్వారా అంతర్జాతీయంగా భారతదేశం తన సత్తా చాటాలని చూస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.