close
Choose your channels

47డేస్ , మూవీ కి ఓవర్సీస్ లో మంచి డిమాండ్

Thursday, February 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో తెరకెక్కిన " 47డేస్" ఓవర్సీస్ రైట్స్ మంచి రేట్ కు అమ్ముడయ్యాయి.. త్రిశూల్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో విడుదల చేయబోతోంది. ఈ మధ్య వస్తోన్న థ్రిల్లర్ మూవీస్ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి.

అందుకే ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ సినిమాస్`` ఈ సినిమా హక్కులు దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంగావస్తోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్ చేతులమీదుగా రిలీజ్ చేసిన క్యా కరూన్`` అనే పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసి వేసవిలో సినిమాను విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.