close
Choose your channels

ఆఖరి షెడ్యూల్ లో గోపీచంద్ - సంపత్ నంది చిత్రం..!

Tuesday, January 17, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మాస్ స్టార్ గోపీచంద్, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో, శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్, జె పుల్లారావు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న‌ చిత్రం ఆఖ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. ఈ భారీ షెడ్యూల్ లో కొంత టాకీ, మూడు పాట‌లు చిత్రీక‌రించ‌నున్నారు.థాయ్ లాండ్, హైద‌రాబాద్ లో మూడు షెడ్యూల్స్ పూర్తి చేసారు. ఈరోజు ప్రారంభించిన భారీ షెడ్యూల్ ఫిబ్ర‌వ‌రి 20కి పూర్త‌వుతుంది.
ఈ షెడ్యూల్ లో హీరో గోపీచంద్, హ‌న్సిక‌, కేథ‌రిన్ ల‌తో పాటు ముఖ్య తారాగ‌ణం అంతా పాల్గొంటారు. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీక‌రించ‌నున్నారు. ప‌వ‌ర్ ఫుల్ స్ర్కిప్ట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంప‌త్ నంది అంద‌ర‌న్నీ ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ సీన్స్ మ‌రియు ఎమోష‌న‌ల్ సీన్స్ ను సినిమాటోగ్రాఫ‌ర్ సుంద‌ర్ రాజ‌న్ చాలా బాగా చిత్రీక‌రించారు. సంప‌త్ నంది హీరో గోపీచంద్ ను చాలా స్టైలీష్ గా... స‌రికొత్త‌గా చూపిస్తున్నాడు. ఎస్.ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ స్ర్కిప్ట్ కి త‌గ్గ‌ట్టు ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ను త్వ‌ర‌లో ఎనౌన్స్ చేయ‌నున్నాం. ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్ గా రిలీజ్ చేయ‌నున్నాం అని నిర్మాత తెలిపారు.
గోపీచంద్, హన్సిక మొత్వానీ, క్యాథరీన్ ట్రెసా, నికితిన్ థీర్ (తంగబలి), తనికెళ్ల భరణి, ముకేష్ రిషి తదితరులు, సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్ : బెజవాడ కోటేశ్వరరావు, బ్యానర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : సంపత్ నంది

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.