close
Choose your channels

బిగ్‌ బాస్-3లో ఎంట్రీపై గుత్తా జ్వాల క్లారిటీ

Sunday, May 26, 2019 • తెలుగు Comments

బిగ్‌ బాస్-3లో ఎంట్రీపై గుత్తా జ్వాల క్లారిటీ

సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ 3 తెలుగులో త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఫలానా హీరో హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారని.. బిగ్ ‌బాస్ కంటెస్టెంట్లు వీళ్లేనని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో ఎక్కువ మంది సినీ నటులు కాగా.. ఒకరిద్దరు కామన్ మెన్స్.. వీరితో పాటు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల పేరు వినపడింది. ఆ కంటెస్టెంట్ల పేర్లు తెలిసిన బిగ్ బాస్ ప్రియులు ఈ సారి మంచి రంజుగా షో జరుగుతుందని అందరూ భావిస్తున్నారు.

అయితే.. కంటెస్టెంట్‌గా బిగ్‌ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై గుత్తా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా వెళ్తున్నట్లు వార్తలన్నీ అవాస్తవాలేనని ఆమె తోసిపుచ్చారు. ‘నో బిగ్ ‌బాస్ ఫర్ మీ.. అన్నీ అవాస్తవాలే’ అంటూ గుత్తా ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌కు ఆమె అభిమానులు మాత్రం.. మీకు అవకాశం వస్తే అస్సలు కాదనుకోకండి మేడం అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న బిగ్‌బాస్‌ 3లో.. యాంకర్‌ శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, ఆర్జే హేమంత్‌, శ్రీరెడ్డి ఇలా పలుపేర్లు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో.. అసలు బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎవరు వెళ్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే,.

Get Breaking News Alerts From IndiaGlitz