close
Choose your channels

టాలీవుడ్ , బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్న పురాణపండ ' హనుమంతుడు'

Thursday, October 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనంత రూపాలతో, అనంత బాహువులతో మహా స్వరూపంగా ఈ లోకాన్ని సంరక్షిస్తున్న ఆంజనేయ భగవానునిపై ఈ దేశంలో తొలిసారిగా ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనఁగా అమోఘ రీతిలో వెలువరించిన ఉపాస్య విశేష సంచిక ' నేనున్నాను' అద్భుత ఉపాస్య గ్రంధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పీఠాధిపతులు, మఠాధిపతులు , మేధావి వర్గంతో పాటు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.

ఈ ఉదయం ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ నుండి ఈ ' నేనున్నాను ' గ్రంధాన్ని స్వీకరించిన బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ తన ఆరాధ్య దైవం ఆంజనేయునిపై ఇంతటి గ్రంధాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని , భాష రాకున్నా ఈ మహా గ్రంధాన్ని తన పూజా మందిరంలో పూజ్య స్థానంలో ఉంచుతానని చెప్పారు. పురాణపండ శ్రీనివాస్ కి ఈ సందర్భగా ధన్యవాదాలు తెలిపారు.

టాలీవుడ్ అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, 'లెజెండ్' బాలకృష్ణ, దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకులు ఎస్.ఎస్.కీరవాణి, , జూనియర్ ఎన్టీఆర్ తదితర సినీ ప్రముఖులు ఈ మహాగ్రంధాన్ని స్వీకరించి ఈ గ్రంథ సౌందర్యాన్ని, రచనా సంకలన వైభవాన్ని ప్రశంసించారు.

భారతదేశంలో తొలిసారిగా ఐదువందల ఆంజనేయ మూల విరాట్టులతో, యంత్ర మంత్రం తంత్రాత్మకంగా పురాణపండ శ్రీనివాస్ అద్భుతంగా రూపొందించిన ఈ ' నేనున్నాను ' మహాగ్రంధాన్ని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ' వారాహి చలన చిత్రం' అధినేత సాయి కొర్రపాటి సమర్పణాభావంతో ప్రచురించడం గమనార్హం.

అతి అరుదైన ఆంజనేయ వర్ణచిత్రాలతో, నాణ్యతా ప్రమాణాల అపురూప ముద్రణతో, పురాణపండ శ్రీనివాస్ అద్భుత భాషా సొగసులతో చాలా చక్కగా అందిన ఈ హనుమాన్ బడా బుక్ తెలుగులో ఇంతవరకూ ' న భూతొ న భవిష్యత్ ' అన్నారు మెగాస్టార్ చిరంజీవి.

మంత్ర విద్యలకు మహాకేంద్రంగా ఈ హనుమాన్ బుక్ ని నందమూరి బాల కృష్ణ అభివర్ణించారు.

తెలుగు రాష్ట్రాలలోని ఆంజనేయాలయాలకు, వేదపాఠశాలలకు, పండిత ప్రముఖులకు గ్రంథాలయాలకు, సాంస్కృతిక సంస్థలకు ఈ ఐదు వందల పేజీల ఆంజనేయ వైభవాన్ని సాయి కొర్రపాటి ఉచితంగా అంజేస్తుండతాన్ని పలువురు ప్రముఖులు అభినందనలు వర్షిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.