close
Choose your channels

హ్యాపీ బ‌ర్త్ డే టు అల్లు శిరీష్

Monday, May 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ మూడ‌వ కుమారుడు అల్లు శిరీష్..మాస్ క‌మ్యూనికేష‌న్స్ లో డిగ్రీ పూర్తి చేసి.. ఆత‌ర్వాత సినిమాల పై మ‌క్కువ‌తో త‌మ సొంత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించే చిత్రాల‌కు కో - ప్రొడ్యూస‌ర్ గా ఉంటూ నిర్మాణంలో మెళుకువ‌లు నేర్చుకున్నారు. సూర్య హీరోగా మురుగుదాస్ తెర‌కెక్కించిన గ‌జిని చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో రీమేక్ చేసారు. ఈ చిత్రానికి నిర్మాత అల్లు అర‌వింద్ కాగా కో - ప్రొడ్యూస‌ర్ గా అల్లు శిరీష్ వ్య‌వ‌హ‌రించారు.

గౌర‌వం తో హీరోగా ఎంట్రీ..

తండ్రి అల్లు అర‌వింద్ వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని అల్లు శిరీష్ నిర్మాత అవుతారు అనుకుంటే...ఊహించ‌ని విధంగా శిరీష్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాధామోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు శిరీష్ గౌర‌వం చిత్రం ద్వారా హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా వైవిధ్య‌మైన క‌థాంశంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అల్లు శిరీష్ తొలి చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌లేక‌పోయినా...న‌టుడుగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. గౌర‌వం త‌ర్వాత ద్వితీయ ప్ర‌య‌త్నంగా యువ ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త‌జంట చిత్రంలో న‌టించాడు. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన కొత్త‌జంట చిత్రంతో అల్లు శిరీష్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించాడు. అల్లు శిరీష్ మూడ‌వ చిత్రంగా శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సోలో ఫేం ప‌రుశురామ్ తెర‌కెక్కిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. త్వ‌ర‌లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రాన్నిరిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో...

అల్లు శిరీష్ హీరోగా న‌టిస్తున్న నాలుగ‌వ చిత్రం ఇటీవ‌ల ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్నిఎస్.శైలేంద్ర‌బాబు, కె.వి.శ్రీధ‌ర్ రెడ్డి, హ‌రీష్ దుగ్గిశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం ద్వారా ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతు న్నాడు. ఈ చిత్రంలో కామెడితో పాటు పెర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న రోల్ లో అల్లు శిరీష్ క‌నిపిస్తారు. ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుండ‌డం విశేషం. జులై ఫ‌స్ట్ వీక్ నుంచి ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ...స‌క్సెస్ కోసం త‌పిస్తూ... శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రంతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతూ...ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న అల్లు శిరీష్ హ్యాపీ బ‌ర్త్ డే & ఆల్ ది బెస్ట్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.