close
Choose your channels

హ్యాపీ బర్త్ డే టు సూపర్ స్టార్ రజనీకాంత్...

Saturday, December 12, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భార‌త‌దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానుల‌ను సంపాదించుకున్నస్టార్... సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. డిసెంబ‌ర్ 12న ర‌జ‌నీకాంత్ పుట్టిన‌రోజు. అభిమానుల‌కు పండ‌గ రోజు. అలాగే...ర‌జ‌నీ తెర‌పై క‌న‌ప‌డితే చాలు..ఫ్యాన్స్ కి ఫెస్టివ‌లే. ర‌జ‌నీకాంత్ గొప్ప న‌టుడే కాదు..అంత‌కు మించి గొప్ప మాన‌వ‌తావాది. ఈరోజు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ గురించి క్లుప్లంగా మీకోసం...

ర‌జ‌నీ స్టైలే వేరు..

చిన్న‌ప్ప‌టి నుంచి న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో 25 ఏళ్ల వ‌య‌సులో మ‌ద్రాస్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్నారు ర‌జ‌నీకాంత్. ఇంత‌కీ ర‌జనీకాంత్ అస‌లు పేరు ఏమిటంటే..శివాజీరావు గైక్వాడ్. ఆయ‌న క‌థ సంగ‌మ అనే క‌న్న‌డ సినిమాలో తొలిసారి న‌టించారు.త‌మిళ్ లో అపూర్వ రాగంగ‌ల్ అనే సినిమాలో ర‌జ‌నీ తొలిసారి న‌టించారు. ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ క్యాన్స‌ర్ పేషెంట్ గా న‌టించారు. ఈ చిత్రాన్ని బాల చంద‌ర్ తెర‌కెక్కించారు. ఎన్నో స‌పోర్టింగ్ రోల్స్, విల‌న్ క్యారెక్ట‌ర్స్ చేసిన ర‌జ‌నీకాంత్ పాజిటివ్ క్యారెక్ట‌ర్ చేసిన తొలి చిత్రం భువ‌న ఓరు కెల్వికురి. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ భ‌గ్న‌ప్రేమికుడు పాత్ర పోషించారు. ఇలా ప్రారంభ‌మైన ర‌జ‌నీ కెరీర్ ఆత‌ర్వాత త‌న‌దైన స్టైల్ తో, మేన‌రిజ‌మ్స్ తో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుని వెల‌క‌ట్ట‌లేని అభిమాన‌గ‌ణాన్ని సంపాదించుకున్నారు. తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ, బెంగాలీ త‌దిత‌ర‌ల చిత్రాల్లో న‌టించి..దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు ఏర్ప‌రుచుకున్నారు.

మ‌రో భాషా...క‌బాలి

ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ ఓల్డ్ గెట‌ప్ లో మాఫియా డాన్ లా చాలా స్టైలీష్ గా క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజ్ చేసిన క‌బాలి ఫ‌స్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ ల‌భించింది. ప్ర‌స్తుతం మ‌లేషియాలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టిస్తుంది. దన్షిక, రిత్వికా, దినేష్‌, కలైయరశన్‌, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ర‌జనీకాంత్ తో ఇదివరకు న‌టించ‌ని నటులు ఈ చిత్రంలో న‌టిస్తుండ‌డం విశేషం. త‌మిళ్ లో క‌బాలి టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీకి తెలుగులో మ‌హ‌దేవ్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. స‌మ్మ‌ర్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న క‌బాలి చిత్రం భాషా స్టైయిల్ ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

సెన్సేష‌న‌ల్ రోబో 2

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందుతున్న క్రేజీ మూవీ రోబో 2. ఈ చిత్రాన్ని ఇండియాలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకి ఖ‌ర్చు పెట్ట‌నంత అంటే దాదాపు 250 కోట్లు పైగా భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రాన్ని ర‌జ‌నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈరోజు ప్రారంభించాల‌నుకున్నారు. అయితే చెన్నై న‌గ‌రం వ‌ర‌ద భీభ‌త్సం వ‌ల‌న ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే రోబో 2 ప్రారంభించ‌డం క‌రెక్ట్ కాద‌ని వాయిదా వేయాల‌నుకున్నారు. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం... రోబో 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ రిక్వెస్ట్ మేరకు రోబో 2 మూవీ ప్రారంభోత్స‌వాన్ని ఈరోజు గ్రాండ్ గా కాకుండా నిరాడంబ‌రంగా లాంచ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఈ నెల 16 నుంచి రోబో 2 రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.

గొప్ప మాన‌వ‌తావాది..

చెన్నై న‌గ‌ర ప్ర‌జ‌లు వ‌ర‌ద‌ల వ‌ల‌న ఇబ్బందులు ప‌డ‌డంతో ర‌జ‌నీకాంత్ ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు త‌న వంతుగా ప‌ది కోట్లు ఆర్ధిక స‌హాయం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇలా ఎప్పుడు క‌ష్టం వ‌చ్చినా..త‌న వంతుగా స‌హాయం చేయ‌డానికి ముందుంటారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల కోస‌మే కాకుండా గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏర్ప‌డిన ప్ర‌క్రుతి వైప‌రీత్యాల వ‌ల‌న న‌ష్టపోయిన‌ ప్ర‌జానికానికి కూడా ర‌జ‌నీ స‌హాయం చేసారు. భాషా బేధం లేకుండా స‌హాయం చేసే గొప్ప మాన‌వ‌తావాది ర‌జ‌నీకాంత్. ఓ వైపు క‌బాలి షూటింగ్ జరుగుతుండ‌గానే..మ‌రో సెన్సేష‌న‌ల్ మూవీ రోబో 2 ను ప్రారంభిస్తూ...ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి బ‌ర్త్ డే విషెష్ తెలియ‌చేస్తుంది ఇండియా గ్లిల్ట్జ్.కామ్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.