close
Choose your channels

పూర్తి స్థాయి డైరెక్ట‌ర్‌గా మారిన హీరో

Tuesday, January 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూర్తి స్థాయి డైరెక్ట‌ర్‌గా మారిన హీరో..

ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మార్స్ గ్ర‌హంపై వెళ్ల‌డానికి చేసిన ప్ర‌యోగాల్లో నంబి నారాయ‌ణ‌న్ కృషి ఎంతో ఉంది. ఆయ‌న జీవిత క‌థ‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కుతోన్న చిత్రం `రాకెట్రీ: ది నంబి నారాయ‌ణ‌న్ ఎఫెక్ట్‌`. మాధ‌వ‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సిమ్రాన్ ఇందులో మాధ‌వ‌న్ స‌ర‌స‌న న‌టిస్తున్నారు. అనంత మ‌హాదేవ‌న్‌ను ద‌ర్శ‌కుడిగా అనుకున్నారు.

అయితే ఆయ‌న ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలో మాధ‌వ‌న్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నార‌ట‌. . నంబి నారాయ‌ణ‌న్ జీవితంలో మూడు కోణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ సమ్మ‌ర్‌లో తెలుగు, త‌మిళం, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మాధ‌వ‌న్ న‌టుడి నుండి ద‌ర్శ‌కుడిగా మారి చేస్తున్న తొలి చిత్రం ఓ బ‌యోపిక్ కావ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.