close
Choose your channels

పెళ్లి కాకుండానే గర్భం.. ప్రకటించిన హీరోయిన్!

Tuesday, June 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లైవ్ ఇన్ రిలేషన్ షిప్స్ బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొంతమంది నటీమణులు పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన సంఘటనలు బాలీవుడ్ లో ఉన్నాయి. నటి నేహా ధూపియా, హార్దిక్ పాండ్య ప్రేయసి నటాషా వివాహానికి ముందే గర్భవతులయ్యారు. తాజాగా స్లమ్ డాగ్ మిలినియర్ నటి ఫ్రిదా పింటో ఆ జాబితాలోకి చేరింది.

ఇదీ చదవండి: నిర్మాత సి. కళ్యాణ్ పై కేసు నమోదు.. ఆ ముగ్గురితో కలసి బెదిరిస్తూ..

తన ప్రియుడు క్యారీ ట్రాన్ తో కలసి అందమైన ఫోటో ద్వారా తాను గర్భవతిని అనే విషయాన్ని ప్రకటించింది. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. గర్భంతో ఉన్న ఫ్రిదా తన ప్రియుడు ట్రాన్ ని హత్తుకుని ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

క్యారీ ట్రాన్, ఫ్రిదా పింటో మధ్య 2017లో ప్రేమ మొదలైంది. 2019లో తాము నిశ్చితార్థం చేసుకున్నట్లు ఈ జంట ప్రకటించారు. త్వరలో ఓ బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారు.మరి పెళ్లి పీటలెక్కేది ఎప్పుడో.

ఇదిలా ఉండగా ఫ్రిదా పింటో బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది. స్లమ్ డాగ్ మిలీనియర్ చిత్రంతో నటిగా మారిన ఫ్రిదా ఆ తర్వాత ఇమ్మోర్టల్స్ , లవ్ వెడ్డింగ్ రిపీట్ లాంటి చిత్రాల్లో నటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.