close
Choose your channels

టెన్ష‌న్ ప‌డ్డ హీరోయిన్‌...

Sunday, November 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెహ‌బూబా అంటే ప్రేయ‌సి ..పూరి త‌న చిత్రంలో ప్రేయ‌సిని కొత్త కోణంలో చూపెట్ట‌నున్నారు. పూరి డైరెక్ష‌న్‌లో ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం 'మెహబూబా'లో మెహ‌బూబాగా నేహాశెట్టి న‌టిస్తుంది. ఈ అమ్మ‌డుకి చిన్న‌ప్ప‌ట్నుంచే సినిమాల్లో న‌టించాల‌నే కోరిక ఉండేద‌ట‌. తొలి చిత్రం 'ముంగారు మలై2' తర్వాత పూరి నుండి కాల్ అందుకుని హైద‌రాబాద్ చేరుకున్న నేహాశెట్టి 200 హీరోయిన్స్‌తో పోటీ ప‌డింద‌ట‌. ఆ స‌మ‌యంలో కాస్త టెన్ష‌న్ ప‌డ్డాన‌ని, అయితే పూరి త‌న‌ను సెల‌క్ట్ చేయ‌డంతో చాలా ఆనంద ప‌డ్డాన‌ని నేహా చెప్పుకొస్తుంది.

1971లో జ‌రిగిన ఇండో పాక్ నేప‌థ్యంలో సాగే ఈ ఈ సినిమా పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగుతుంద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్. తెలుగులో పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌న్నీ పెద్ద స‌క్సెస్‌ల‌య్యాయి. కెరీర్ స్టార్టింగ్‌లో విభిన్న‌మైన సినిమాలు చేసిన పూరి డ్ర‌గ్స్‌, మాఫియా సినిమాలు, యార‌గెంట్ హీరోల సినిమాలు చేయ‌డానికే ఆస‌క్తి చూపాడు. అయితే ఈ సారి లైన్ మార్చి పున‌ర్జ‌న్మ‌ల కాన్సెప్ట్ ల‌వ్‌స్టోరీ చేయ‌డం అంటే కాస్త కొత్త‌గానే ఉంది మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.