close
Choose your channels

ప్రవీణ్ సత్తార్, నాగ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్

Wednesday, March 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రవీణ్ సత్తార్, నాగ్ మూవీలో హీరోయిన్ ఫిక్స్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవలే నాగార్జున కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో నాగ్ ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం కొన్నాళ్లుగా చూస్తున్నారు. కానీ తాజాగా హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది. తాజాగా కాజల్‌ను ప్రవీణ్ సత్తారు హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. సినిమాకు కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ నెల 31 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న షూటింగ్‌లో కాజల్ జాయిన్ కానుంది. ఇప్పటికే ‘ఆచార్య’లో చేస్తున్న కాజల్.. ప్రస్తుతం నాగ్ సరసన హీరోయిన్‌గా చేయడానికి కాజల్ అంగీకరించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు తగ్గట్టు గుబురు గడ్డం పెంచాలని ఫిక్స్ అయ్యాడు. కాగా.. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వైడ్ అప్పీల్ తీసుకురావడం కోసం భిన్న భాషలు నుండి నటీనటులను తీసుకుంటోందట చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమాలో నాగ్ చెల్లెలిగా చంఢీఘర్ భామ, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ గుల్‌పనాగ్‌ నటిస్తోంది. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నారాయణ దాస్ నారంగ్, శరత్ మరార్, పుస్కూరి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

ఇక ప్రస్తుతం అక్కినేని నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నాగార్జున సరికొత్తగా కనబడనున్నాడు. ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన దియా మీర్జా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో సయామీ ఖేర్ నటిస్తోంది. ఇటీవల నాగ్ వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్‌ డాగ్ విజ‌య్ వ‌ర్మ పాత్ర‌లో నాగార్జున కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను మొదట్లో ఓటీటీలో విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. ఆ డీల్‌ను క్యాన్సల్ చేసుకుని నేరుగా థియేటర్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.