close
Choose your channels

మ‌రో అమితాబ్ రీమేక్‌లో హృతిక్‌

Thursday, July 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో అమితాబ్ రీమేక్‌లో హృతిక్‌

బాలీవుడ్ గ్రీకు హీరో హృతిక్ రోష‌న్‌.. త్వ‌ర‌లోనే అమితాబ్ సినిమా రీమేక్‌లో న‌టించ‌నున్నారు. 1982లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, హేమా మాలిని న‌టించిన `స‌త్తే పే స‌త్తా`. ఈ సినిమాను ఇప్పుడు రీమేక్ చేయ‌బోతున్నారు. ఇది వ‌రకు హృతిక్ అమితాబ్ న‌టించిన `అగ్నిప‌థ్‌` సినిమాను రీమేక్ చేశారు. కాగా అన్ని స‌వ్యంగా జ‌రిగితే.. ఇది ఆయ‌న రీమేక్ చేయ‌బోయే రెండో సినిమా అవుతుంది. ఫ‌ర్హాఖాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారట‌. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తార‌ట‌. దీపికా ప‌దుకొనెను హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నారని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై మ‌రింత క్లారిటీ రానుంది. ఈ శుక్ర‌వారం హృతిక్ గ‌ణిత జీనియ‌స్ ఆనంద్ కుమార్ బ‌యోపిక్ `సూప‌ర్ 30`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.