close
Choose your channels

ప్రభాస్‌ జాన్ కోసం భారీ సెట్‌

Saturday, November 16, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్‌ జాన్ కోసం భారీ సెట్‌

‘బాహుబలి’తో ప్రభాస్‌ హీరో రేంజ్‌ అమాంతం పెరిగింది. లోకల్‌ స్టార్‌ కాస్త నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు. అందుకే.. పాన్‌ - ఇండియా అప్పీల్‌ ఉండేలా కథలను ఎంచుకుంటున్నాడు ఈ హ్యాండ్సమ్‌ హీరో. తాజాగా ‘సాహో’తో పలకరించిన ప్రభాస్‌.. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘జాన్‌' (వర్కింగ్‌ టైటిల్‌)ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే షూటింట్‌ను స్టార్ట్‌ చేసుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనుంది.‘జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడికల్‌ లవ్‌ స్టోరీలో ప్రభాస్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

1970ల కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరికొత్త లుక్‌లో కనిపిస్తాడని సమాచారం. పీరియాడికల్‌ లవ్‌స్టోరి కాబట్టి కొత్త షెడ్యూల్‌ను ఆ స్టైల్లో తెరకెక్కించడానికి యూనిట్‌ సన్నద్ధమవుతుంది. అందుకోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ ఓ స్పెషల్‌ సెట్‌ను వేస్తున్నాడు.భారీ ఖర్చుతో ఈ సెట్‌ను నిర్మిస్తున్నారట. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ‘జాన్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే దిశగా పక్కా ప్లానింగ్‌ జరుగుతోందట. మరి.. ‘వర్షం’, ‘డార్లింగ్‌' తరువాత చాన్నాళ్ళకి ప్రభాస్‌ చేస్తున్న ప్రేమకథ ఇది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment