close
Choose your channels

ఇలియానా షాకింగ్ డెసిష‌న్‌..?

Tuesday, April 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇలియానా షాకింగ్ డెసిష‌న్‌..?

గోవా బ్యూటీ ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా క్రేజ్ ఉన్న స‌మ‌యంలోనే టాలీవుడ్‌ను వీడి బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో బాలీవుడ్‌లో బ‌ర్ఫీతో స‌క్సెస్ కొట్టిన‌ప్ప‌టికీ ఆశించిన స్థాయిలో మాత్రం అవ‌కాశాలు ఇలియానాను వ‌రించ‌లేదు. అదే స‌మయంలో టాలీవుడ్ నుండి వ‌చ్చిన అవ‌కాశాల‌ను ఇలియానా ప‌ట్టించుకోలేదు. మ‌రోప‌క్క ప్రేమ‌లో ప‌డ‌టం, లివిన్ రిలేష‌న్ వంటి ప‌నుల‌తో కెరీర్‌ను ప‌ట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్ కూడా ఇలియానాను ప‌క్క‌న పెట్టేసింది.

ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ప్ర‌య‌త్నాలు చేసింది. అదే స‌మ‌యంలో తెలుగులోనూ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంలోనూ న‌టించింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. అలాగే ఇలియానా చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ పెద్ద‌గా క‌లిసి రాలేదు. దీంతో ఇప్పుడు ఈ భామ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. త్వ‌ర‌లోనే యాంక‌ర్‌గా మార‌నుంద‌ట‌. స‌మాచారం మేర‌కు ఓ ప్ర‌ముఖ స్పోర్ట్స్ ఛానెల్ ఇలియానాతో సంప్ర‌దింపులు జ‌రిపుతోంద‌ట‌. అంతా ఓకే అయితే త్వ‌ర‌లోనే ఇలియానాను స్పోర్ట్స్ ఛానెల్‌లో యాంక‌ర్‌గా చూడొచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.