close
Choose your channels

BiggBoss: ‘‘పిట్ట’’ అంటూ కామెంట్.. ఇనయా- శ్రీహాన్‌ల గొడవతో దద్దరిల్లిన హౌస్

Friday, September 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కెప్టెన్సీ కంటెండెర్స్ కోసం జరుగుతోన్న అడవిలో ఆట టాస్క్.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. ఒకరిద్దరు తప్ప మిగిలిన ఇంటి సభ్యులంతా ఉత్సాహంగా ఆట ఆడారు. మరి వీరిలో కెప్టెన్సీ పోటీదారులుగా ఎవరు నిలిచారో చూస్తే.. శ్రీహాన్, గీతూ, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచారు. ఈ సందర్భంగా వీరికి బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు. బ్రిక్స్‌ని పిరమిడ్‌లా పేర్చి వాటిని కాపాడుతూ వుండాలి. దీనికి రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడు. మన గలాటా గీతూ ముందే చేతులెత్తేయగా.. ఫైమా మాత్రం తీవ్రంగా ప్రయత్నించింది. పాపం బ్రిక్స్‌ని కాపాడుకునే యత్నంలో ఫైమా చేతులే తగిలడంతో ఆమెపై అనర్హత వేటు వేశాడు రేవంత్. అయితే ఫైమా కోసం ఇనయా గట్టిగా నిలబడింది. శ్రీహాన్‌ కూడా బ్రిక్స్‌కి టచ్ అయ్యాడు. మరి అతన్ని ఎందుకు డిస్‌ క్వాలిఫై చేయలేదని ఇనయా ప్రశ్నించింది.

దీనికి శ్రీహాన్‌కి మండిపోయింది. ఏ పిట్ట వచ్చిన నీ దగ్గర ఏం కూసినా... సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్వు తీసుకో అంటూ రేవంత్‌కి సలహా ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. నన్ను పిట్ట అంటావా అని ఇనయా ప్రశ్నించగా.. నేను నీ పేరు పెట్టి చెప్పానా అని వాదించాడు. టైం కోసం ఎదురుచూస్తున్న మన గలాటా గీతూ మధ్యలో దూరిపోయింది. అసలు పిట్ట అన్నది నిన్ను కాదు నన్ను అని అడ్డదిడ్డంగా వాదించి గొడవకు దిగింది. ఇంత జరిగినా శ్రీహాన్‌ని మాత్రం వదిలిపెట్టలేదు ఇనయా. అతని వెనకాలే వెళుతూ.... నిన్ను వాడు వీడు అంటే ఒప్పుకోవు, నన్ను పిట్ట అని ఎలా అంటావ్ అంటూ కేకలు పెడుతూనే వుంది.

ఇదిలావుండగా .. ఇనయాకు యాంటీ గ్రూప్‌గా వున్న ఆదిరెడ్డి, గీతూ, నేహా, ఆర్జే సూర్యలు ఆమె గురించి మాట్లాడుకున్నారు. దీనిపై శనివారం నాగార్జున సార్ క్లాస్ పీకుతారని అనుకున్నారు. మొత్తంగా ఈ రోజు ఇనయా- శ్రీహాన్‌ల గొడవ హైలైట్ అయ్యింది. ఇకపోతే.. బిగ్‌బాస్ 6 హౌస్‌లో లవ్ ట్రాక్‌లు లేక కాస్త రోమాంటిక్ ఫీల్ మిస్ అయ్యిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో అర్జున్ ఆ వైపుగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా శ్రీ సత్యతో అతను పులిహోర కలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేను అందరినీ అన్నయ్య అని పిలుస్తానని.. దాన్ని యాక్సెప్ట్ చేయడం, చేయకపోవడం మీ ఇష్టం అని శ్రీ సత్య అర్జున్‌తో అంటుంది. దీనికి అతను సైలెంట్ అయిపోయాడు. వీరిద్దరి గురించి నేహా, శ్రీహాన్‌లు మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోందని నేహా అడుగుతుంది. నాకు తెలిసినంత వరకు వాడికి ఆ అమ్మాయి మీద ఏదో ఫీలింగ్ వుందని, కానీ చెప్పడం లేదని శ్రీహాన్ బదులిస్తాడు. మరి వాసంతితోనూ అలానే వుంటున్నాడు కదా అని నేహా ఎదురు ప్రశ్నిస్తుంది. మరి శ్రీసత్య- అర్జున్ మధ్య రిలేషన్ ఏంటో... ఈవారం కెప్టెన్‌గా ఎవరు ఎంపికవుతారో తెలియాలంటూ రేపటి వరకు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.