close
Choose your channels

ఆ సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి: 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' నిర్మాత రామ్మోహనరావు

Friday, April 13, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి: ఇంతలో ఎన్నెన్ని వింతలో నిర్మాత రామ్మోహనరావు

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారాగణంతో  హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహించిన  చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'.

ఈ చిత్రం ఏప్రిల్ 6న విడుదలయ్యి మంచి మన్ననలను పొందుతూ సక్సెస్ బాటలో పయనిస్తోంది..  ఈ సందర్బంగా నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి మీడియా తో ముఖాముఖిలో పాల్గొన్నారు.. 

ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేశారు.. ?

దర్శకుడు వరప్రసాద్ వరకూటి నా స్నేహితుడు.. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజ్ లో ఇద్దరం కలసి చదువుకున్నాం.. అప్పటినుంచే అతను మాకు మంచి కథలను చెప్పేవాడు.. అతను సినిమా ఫీల్డ్ కు వచ్చాక కూడా మాతో టచ్ లో ఉండేవాడు.. అలా మా జర్నీ మొదలయ్యింది..

అప్పుడే వరప్రసాద్ నాకు ఇంతలో ఎన్నెన్ని వింతలో కథ వినిపించాడు లైన్ చాలా బాగుంది.. మంచి అవకాశం దొరికి అందరూ సహకరిస్తే కథను సినిమాగా మలచాలని బావించాము.. అనుకున్నట్టే అన్నీ కుదిరాయి సినిమా స్టార్ట్ చేసాము.. విడుదల కూడా చేసాము సినిమా సక్సెస్ అయ్యింది..

కథ గురుంచి చెప్పాలంటే.. ఒక నలుగురి కుర్రాళ్లలో ఒకరికి ( హీరో నందు ) నిశ్చితార్థం అవుతుంది  36గంటల్లో పెళ్లి ముహూర్తం..ఫ్రెండ్స్ పార్టీ అడుగుతారు. ఈలోగా ఆ నలుగురు వివిధ కారణాల చేత సమస్యల్లో ఇరుక్కుపోతారు..

అప్పుడు ఆ పెళ్లి జరిగిందా..? మిగతా ముగ్గురు పెళ్ళికి వచ్చారా..? ఆ సమస్యనుంచి ఎలా బయటపడతారు అనేది చిత్ర కథాశం.. దాన్నే ఉత్కంఠ భరితంగా చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు వరప్రసాద్.

థియేటర్ల ఫీడ్ బ్యాక్ ఎలావుంది?

చాలా బాగుందండి.. ఈ శనివారానికి 40 థియేటర్ల ను పెంచుతున్నాము.. ముఖ్యంగా బిసి సెంటర్ లో మంచి టాక్ వస్తోంది.. పెద్ద ఆర్టిస్టులు ఎవరూ లేకపోయినా కథ బాగుండటం తో మంచి పేరువస్తోంది.. చుసిన ప్రతిఒక్కరూ ఎవరూ బాగోలేదని చెప్పడం లేదు.. మౌత్ టాక్ తోనే పబ్లిసిటీ బాగొచ్చింది.. అందరికీ ఈ సందర్బంగా కృతజ్ఞతలను తెలియచేస్తున్నా..

థియేటర్లను పెంచాలనే ఆలోచన ఎవరిది..?

డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనే నండి.. టాక్ బాగొచ్చింది థియేటర్లను పెంచుదామని అడిగారు సరే అనడం జరిగింది.. ముఖ్యంగా ఆంధ్రాలో రెస్పాన్స్ బాగుంది.. 

కల్లెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

సంతృప్తి కరంగా ఉన్నాయండి.. అందరూ మెచ్చుకుంటున్నారు.. చెప్పాలంటే చిన్న సినిమాకు పెద్ద రెస్పాన్స్ వచ్చింది..

 సినిమా రిలీజింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?

సినిమాను తీయడం కంటే విడుదల చేయడమే కష్టం అనిపించింది.. పెద్ద సినిమాలను దృష్టిలో  పెట్టుకొని థియేటర్ల సమస్య రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.. అందుకే  ఈ సినిమా విడుదల తేదీ కోసం మేము మూడు నెలల పాటు ఎదురుచూసి ఏప్రిల్ 6న మంచి డేట్ అని ఫిక్స్ అయ్యి ఆ రోజునే విడుదల చేయడం జరిగింది..

మీ సర్కిల్ లో అంటే కుటుంబం, స్నేహితుల నుంచి ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది..?

మంచి జాబ్స్ చేసుకోకుండా..  సినిమా ఏంటని మొదట అందరూ అనే వారు,కానీ మేము మొదటి నుంచీ కథను బాగా నమ్మాము.. ప్రేక్షకులనుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ ను చూసి మంచి సినిమా చేశారని..  కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ మెచ్చుకుంటున్నారు. కథనే నమ్మారని ఇప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు..  చాలా హ్యాపీ గా ఉంది.

మీ స్వస్థలం ఎక్కడ.. మీరు వృత్తి ఏంటి ?

మాది శ్రీకాకుళం. మా పాట్నర్ ఒంగోలు వాసి.. నేను జీ.వి.కె.బయో లో జూనియర్ సైన్టిస్ట్ గా చేసున్నా.. ప్రస్తుతానికి సెలవులో ఉన్నాను. 

ఒక ఆడియన్ గా మీకెలా అనిపించింది ఈ సినిమా..?

తాళిబొట్టు తీసేసే సీన్, తారా తిరిగివచ్చే సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి..

ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతారా..?

మంచి కథ లు దొరికితే తప్పకుండా చేస్తాము.. మా బ్యానర్ లో తప్పకుండా మరో మంచి సినిమా ఉంటుంది.. ఆ వివరాలన్నీ అతి త్వరలోనే అనౌన్స్ చేస్తాము.. మంచి సినిమాలనే తీయాలనే కాన్సెప్ట్ తో వచ్చాము అవే తీస్తాము..

పెద్ద హీరోలతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారా..?

ఇప్పుడు మంచి టీమ్ దొరికింది మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది.. హ్యాపీ. పెద్ద హీరోలతో అంటే అదృష్టం అవకాశం కలసి వస్తే తీస్తాము.. బాలయ్య తో సినిమా చేయాలనే ఆలోచన ఉంది కానీ అది అత్యాశే అవుతుందని భావిస్తున్నా... ప్రస్తుతానికి  ఇలానే సంతృప్తితో ఉన్నాము(నవ్వుతూ) అంటూ ముఖాముఖిని ముగించారు నిర్మాత రామ్మోహన్ రావు ఇప్పిలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.