close
Choose your channels

చైత‌న్య‌కి సాధ్య‌మ‌వుతుందా?

Wednesday, July 17, 2019 • తెలుగు Comments

చైత‌న్య‌కి సాధ్య‌మ‌వుతుందా?

అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో బిజీగా మారాడు. ఇప్ప‌టికే త‌ను `వెంకీ మామ‌` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమా ముగిసీ ముగ‌య‌క ముందే తండ్రి నాగార్జున‌తో క‌లిసి `సొగ్గాడే చిన్ని నాయనా` సినిమా సీక్వెల్ `బంగార్రాజు`లో న‌టించాల్సి  ఉంటుంది. 

ఇన్ని క‌మిట్‌మెంట్స్ ఉండ‌గానే.. ఈ అక్కినేని క‌థానాయ‌కుడితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ఓ సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. మేర్ల‌పాక గాంధీ  ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌టి టాక్‌. అయితే ఇన్ని క‌మిట్‌మెంట్స్ మ‌ధ్య‌లో చైత‌న్య సినిమా చేస్తాడా? అని కూడా ఆలోచించుకోవాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ చైత‌న్యతో కాక‌పోయినా సాయితేజ్‌తో అయినా సినిమా చేయాల‌నుకుంటుంద‌ట యు.వి.క్రియేషన్స్‌.

Get Breaking News Alerts From IndiaGlitz