close
Choose your channels

23న నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఇదేనా..

Thursday, July 21, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కింగ్ అక్కినేని నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నిర్మ‌లా కాన్వెంట్. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఫ్రెష్ ఫ్యూర్ ల‌వ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ స్పెష‌ల్ రోల్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్యారెక్ట‌ర్ ఈ మూవీకి హైలెట్ గా నిలుస్తుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే... నిర్మ‌లా కాన్వెంట్ లేటెస్ట్ టీజ‌ర్ ను నాగార్జున ట్విట్ట‌ర్ లో రిలీజ్ చేసి ఈ నెల 23న మీకు ఓ స‌ర్ ఫ్రైజ్ ఇవ్వ‌బోతున్నాను అని తెలియ‌చేసారు. దీంతో 23న నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఏమిటి అని ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. అయితే...ఈ చిత్రంలో నాగార్జున‌కు స్పెష‌ల్ రోల్ తో పాటు ఓ సాంగ్ కూడా ఉంది. సో...నిర్మ‌లా కాన్వెంట్ లో నాగ్ సాంగ్ ని 23న రిలీజ్ చేయ‌నున్నారేమో అనిపిస్తుంది. మ‌రి...నాగ్ ఇచ్చే స‌ర్ ఫ్రైజ్ ఏమిటో తెలియాలంటే 23 వ‌ర‌కు ఆగాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.