close
Choose your channels

'శ్రీపూర్ణిమ' మా అదృష్టమన్న జబర్దస్త్ టీమ్

Thursday, October 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీపూర్ణిమ  మా అదృష్టమన్న  జబర్దస్త్ టీమ్

గురువారం వస్తే చాలు నవ్వుల ప్రియులకు పండగే. ' జబర్దస్త్ ' ప్రోగ్రామ్ తెలుగు లోగిళ్లను నవ్వుల కేరింతలతో, తుళ్ళింతలతో ఊపేస్తోంది. రేటింగ్ కూడా చాలా హై లెవెల్లో ఉంటోంది. రోజా నవ్వుల వెన్నెల, నాగబాబు గాంభీర్యంతో కూడిన నవ్వుల జడ్జిమెంట్ ఈ ప్రోగ్రామ్ కే హైలెట్. అయితే దసరా పండుగ సందర్భంలో జరిగిన జబర్దస్త్ షూటింగ్ లో ఒక ఆసక్తికర పవిత్ర సన్నివేశం చోటు చేసుకుంది. తన కుటుంబ సభ్యుల్లా జబర్దస్త్ టీం మెంబెర్స్ ని ఎంతో ఆప్యాయంగా చూసే రోజా టీం మెంబెర్స్ అందరికీ ఒక అపురూపమైన పుస్తకాన్ని దసరా గిఫ్ట్ గా ఇచ్చింది.

రోజా సమర్పించిన ఈ కానుక పేరే 'శ్రీ పూర్ణిమ'. సుమారు ఎనిమిదివందల అద్భుతమైన అందాల పవిత్ర పూజనీయ గ్రంధం ఈ శ్రీపూర్ణిమ .

ఈ గ్రంథరచయిత , సంకలనకర్త ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ గారు. సహజంగా భక్తురాలైన శ్రీమతి రోజా పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలకు ప్రచురణకర్తగా వ్యవహరించడానికి కారణం వుంది. ఇంతకు ముందు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో అత్యంత కీలక పదవిలో రాష్ట్ర ప్రభుత్వంచే నియమితులై , మహాక్షేత్రమైన శ్రీశైలదేవస్థానానికి కూడా ప్రత్యేక సలహాదారునిగా వ్యవహరించిన ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్.

తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. అయితే ఆడంబరాలకు, ఆర్భాటాలకు, ప్రచారాలకు, సభలకు, సమావేశాలకు శ్రీనివాస్ చాలా దూరంగా వుంటారు . కీర్తికి కూడా చాలా చాలా దూరంగా వుంటారు. అన్నిటికీ మించి అస్సలు స్వార్ధం లేని వ్యక్తి శ్రీనివాస్. జీవితం ఎన్నో కష్టాలు పడినా దైవాన్ని విడిచిపెట్టకుండా అద్భుతాలు చేస్తూనే వున్నారు. అందుకే రోజా శ్రీనివాస్ ని పుస్తకాలకు తాను సమర్పకురాలిగా వ్యవహరించారు. శ్రీనివాస్ కష్టాలకు కొలతలు లేవు. అన్ని బాధలు అనుభవించారాయన. అయినా వెంకటాచలక్షేత్రం అతనికి ఏడుకొండలతో అభయాన్నిస్తూనే వుంది. ఆ నమ్మకంతో శ్రీనివాస్ చేసిన దైవీయ చైతన్యాల ప్రయోగాలు అమోఘం.

పీఠాలలో, మఠాలలో, ఆలయాలలో, పండిత గృహాలలో , గ్రంథాలయాలలో, భక్తజన గృహాలలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలకు కొదువలేదు. ప్రతీ పుస్తకం ఒక మంత్రం పుష్పమే. ప్రతీ పుస్తకం ఒక మంత్రం పేటికే. ప్రతీ పుస్తకం ఒక మంత్రాలయమే. ప్రతీ పుస్తకం ఒక మంత్రం సమూహ శక్తే. రోజా సమర్పించిన ఈ గ్రంధంలో సైతం తనకు ఆత్మ బంధువులైన వారాహి చలన చిత్రం అధినేతలు సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి దంపతుల పేర్లను శ్రీనివాస్ కృతజ్ఞతాపూర్వకంగా ప్రకటించడం గమనార్హం.

రోజా ఇటీవల పురాణపండ శ్రీనివాస్ తో ప్రచురించిన శ్రీపూర్ణిమ గ్రంధానికి వచ్చిన స్పందన మామూలు స్థాయిలో లేదు. తిరుమల, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, అహోబిలం, యాదాద్రి మొదలుకొని ఎన్నో , ఎన్నెనో మహా శైవ వైష్ణవ ఆలయాల అర్చకులకు, వేద పండితులకు, వేదపాఠశాలలకు రోజా స్వయంగా సమర్పించడంతో రోజా ని ' శహభాష్ ' ప్రశంసించి దీవించారు. అయితే ... దసరా సందర్భాన్ని పురస్కరించుకుని జబర్దస్త్ టీం అందరికీ రోజా ఈ అమృతమయ శ్రీ పూర్ణిమ గ్రంధాన్ని అందించడంతో హైపర్ ఆది, చలాకి చంటి మొదలు, దొరబాబు వరకు పరవశంతో రోజాకు 'థాంక్స్ మేడం ' సూపర్ బుక్ ఇచ్చారంటూ ధన్యవాదాలు చెప్పారు.

రోజా చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి అనుగ్రహంతో ఈ బుక్ ఇస్తున్నానని, ఖాళీ సమయాల్లో ప్రార్ధనకై ఇది చాలా ఉపయోగపడుతుందని జబర్దస్త్ మొత్తం టీం కి చెప్పడం విశేషమే మరి. ఏది ఏమైనా రోజా శ్రీపూర్ణిమ మహాగ్రంధం పురాణపండ శ్రీనివాస్ చేసిన పవిత్రమైన సందడి మామూలు స్థాయిలో లేదు. ఒక రాజకీయ నాయకురాలు తెలుగు రాష్ట్రాలలో పారమార్థికంగా ఇలాంటి అద్భుత మంత్రసేవ చేయడం ఇదే మొదటిసారి కావచ్చని విజ్ఞులు గొంతెత్తి రోజా పేరు చెప్పడం చరిత్రలో మిగిలే సత్యం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.