close
Choose your channels

అప్పుడు ర‌వితేజ‌.. ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు

Saturday, April 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విధి ఎంత చిత్రమైనదో కదా.. అనిపిస్తుంది కొన్ని విష‌యాల‌ను ప‌రిశీలిస్తే. ప్ర‌స్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ గా, విల‌న్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఓ సీనియ‌ర్ న‌టుడు కొన్నేళ్ళ క్రితం హీరోగా నటించిన ఓ సినిమాలో.. ఇప్ప‌టి ఒక‌ అగ్ర కథానాయకుడు ఆ చిత్రంలో విలన్‌గా చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆ అగ్ర కథానాయకుడి సినిమాలో.. ఆ ఒక‌ప్ప‌టి స‌క్సెస్‌ఫుల్ హీరో ప్ర‌స్తుతం విలన్‌గా చేస్తున్నాడు.

కాస్త వివరాల్లోకి వెళితే..  సరిగ్గా 19 సంవత్సరాల క్రితం.. అంటే 1999లో కృష్ణ వంశీ దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా ‘సముద్రం’ సినిమా తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే. స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చేపల నానిగా రవితేజ తన విలనిజాన్ని చక్కగా ప్రదర్శించారు. ఆ త‌రువాత వీరిద్ద‌రు 'బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం' చిత్రంలో క‌లిసి న‌టించారు. ఆ త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో సినిమా రాలేదు.

క‌ట్ చేస్తే.. రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేల టిక్కెట్టు’లో ప్రతినాయక ఛాయలున్న పవర్‌ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారు. మరి అప్పుడు జగపతి బాబు హీరోగా చేసిన సినిమాలో రవితేజ విలన్‌గా చేసి మెప్పించారు.. మరి ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ‘నేల టిక్కెట్టు’లో ప్రతినాయక పాత్రలో జగపతి బాబు ఎంతవరకు అలరిస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.