close
Choose your channels

జగపతిబాబు..రిపీట్ అవుతుందా?

Tuesday, August 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లెజెండ్ తో విల‌న్‌గా ట‌ర్న్ అయిన ఒక‌ప్పటి కుటుంబ‌క‌థా చిత్రాల క‌థానాయ‌కుడు జ‌గ‌ప‌తిబాబు.. విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో చేస్తున్నకొత్త‌ ఇన్నింగ్స్ బాగానే న‌డుస్తోంది. ఈ ప్ర‌యాణంలో జ‌గ‌ప‌తికి బాగా పేరు తెచ్చిన చిత్రాలంటే.. లెజెండ్‌, శ్రీ‌మంతుడు, నాన్న‌కు ప్రేమ‌తో చిత్రాల‌నే చెప్పాలి. ఈ మూడు కూడా అగ్ర ద‌ర్శ‌కులు, అగ్ర క‌థానాయ‌కుల కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రాలు కూడా గ‌మ‌నార్హం.
త‌న‌కు మంచి పేరు తీసుకువ‌చ్చిన ఆ మూడు చిత్రాల‌లో రెండు చిత్రాల డైరెక్ట‌ర్స్‌తో జగ్గూభాయ్ మ‌రోసారి ప‌నిచేస్తున్నాడు. లెజెండ్ త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో చేసిన జ‌య‌జాన‌కి నాయ‌క ఈ నెల 11న విడుద‌ల కానుండ‌గా.. నాన్న‌కు ప్రేమ‌తో త‌రువాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రంగ‌స్థ‌లం చేస్తున్నాడు జ‌గ‌ప‌తిబాబు. మ‌రి మ‌ళ్లీ అదే స్థాయి స‌క్సెస్‌, గుర్తింపుని త‌న పాత్ర‌ల‌తో జ‌గ‌ప‌తి రిపీట్ చేస్తాడో లేదో చూడాలి మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.