close
Choose your channels

ఈ సారి అయినా చైతూకి ఫలితం మారుతుందా

Tuesday, August 8, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌తేడాది ప్రేమ‌మ్‌తోనూ.. ఈ ఏడాది రారండోయ్ వేడుక చూద్దాంతోనూ త‌న ఖాతాలో చాన్నాళ్ల త‌రువాత విజ‌యాల‌ను జ‌మ చేసుకున్నాడు నాగ‌చైత‌న్య‌. రారండోయ్‌.. వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత చైతూ న‌టించిన కొత్త చిత్రం యుద్ధం శ‌ర‌ణం. న్యూ టాలెంట్ కృష్ణ మారిముత్తు ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు.

లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుద‌ల కానుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఈ సినిమాపై మంచి ఇంప్రెష‌న్‌నే క‌లిగిస్తున్నాయి. అయితే ఎటొచ్చి.. ఓ విష‌యంలో ఈ సినిమా ఎలాంటి ఫ‌లితం పొందుతుందో అనే ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అదే చైతూకి ఆగ‌స్టు నెల అంత‌గా క‌లిసిరాక‌పోవ‌డం. గ‌తంలో ఇదే నెల‌లో చైతూ న‌టించిన ద‌డ చిత్రం విడుద‌లై డిజాస్ట‌ర్ అయ్యింది. మ‌రి ఈ సారైనా ఆగ‌స్టు నెల చైత‌న్య‌కి మంచి ఫ‌లితాన్ని ఇస్తుందేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.