close
Choose your channels

ఎలివేషన్లు ఆకాశమంత.. సాధించిన సీట్లు గోరంత.. జనసైనికుల ఆగ్రహం కొండంత..

Tuesday, February 27, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎలివేషన్లు ఆకాశమంత.. సాధించిన సీట్లు గోరంత.. జనసైనికుల ఆగ్రహం కొండంత..

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ పేరు వింటేనే జనసైనికులు, అభిమానులు ఊగిపోతారు. తమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి అంటూ కాలర్ ఎగరేసేవారు. కానీ ప్రస్తుతం వారికి జరిగిన అవమానంతో రగిలిపోతున్నారు. చేగువేరా, భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తరుచూ చెబుతూ ఉంటారు. అలాగే తానొక కెరటాని ఎవరికీ సలాం చేయనని.. తానొక శిఖరాని ఎవరికీ తలవంచనని చెబుతూ తనకు తాను భారీగా ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. దీంతో కార్యకర్తలు కూడా పవన్ గురించి అభినవ చేగువేరా లాగా ఏదోదో ఊహించుకున్నారు.

అందుకు తగ్గట్లే వారాహి యాత్ర అంటూ ఓ భారీ వాహనాన్ని సిద్ధం చేశారు. వారాహి ప్రచారంలో భాగంగా అధికార వైసీపీ నేతలపై ఎడాపెడా విమర్శలు చేసేవారు. ఏకంగా సీఎం వైయస్ జగన్‌ను పట్టుకుని "ఏయ్ జగన్.. నువ్వెంత... నీ బతుకెంత" అంటూ ఊగిపోయిన సన్నివేశం ఇంకా ప్రజల కళ్ల ముందు ఉంది. అలాగే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలను గుడ్డలూడదీసి కొడతాను అంటూ చేసిన కామెంట్లు సైతం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో జనసైనికులు సైతం ఆహో ఓహో అంటూ తమ నాయకుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఎలివేషన్లు ఆకాశమంత.. సాధించిన సీట్లు గోరంత.. జనసైనికుల ఆగ్రహం కొండంత..

ఇక జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని కూడా విపరీతంగా పవన్‌ను ఎలివేట్ చేస్తుండేది. కానీ ఆ ఎలివేషన్లకు, వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండా పోయిందని తాజాగా అందరికి బోదపడింది. దీంతో పిట్టలదొరలు మాదిరే తమ నాయకుడు కూడా రాజకీయ జోకర్‌ మారిపోయారని వాపోతున్నారు. తమ నాయకుడి గురించి ఓ రేంజ్‌లో ఊహించుకుంటే ఆయనేమో టీడీపీ అధినేత చంద్రబాబుకు గులాంగిరీ చేస్తున్నారని మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా కేవలం 24 ఎమ్మెల్యే సీట్లు పడేసి తమ నాయకుడి బలాన్ని, విలువను చెప్పకనే చెప్పారని రగిలిపోతున్నారు.

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంగా రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ పవన్ పరామర్శించి రావడం... ఇందుకోసం రోడ్లమీద పడుకోవడం వంటి దృశ్యాలను గుర్తు చేసుకుంటున్నారు. బాబు కోసం ఇంత పోరాడిన తమ నాయకుడికి దక్కిన సీట్లు చూసి.. ముక్కున వేలుసుకుంటున్నారు. దీనికోసమా ఇంత చేసిందని ఫైర్ అవుతున్నారు. ఇంత చేసినా పవన్‌కు చంద్రబాబు ఇచ్చిన విలువ ఇదేనా అని అవహేళన చేస్తున్నారు. పవన్ కన్నా తెలంగాణలో పోటీ చేసిన బర్రెలక్క నయం కదా అని ప్రశ్నిస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దమ్ముతో పోరాడిందని గుర్తు చేస్తున్నారు. "నీ లాగా ఎవరి కాళ్లదగ్గర కూర్చోలేదు.. నిన్ను మేము నమ్ముకోవాలా ? నువ్విచ్చిన ఎలివేషన్లకు... నీకు దక్కిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా..? అంటూ నిలదీస్తున్నారు. "నీ బానిస బుద్ధి పుణ్యాన మొత్తం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేసావు అంటూ" కాపు యువత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.