close
Choose your channels

Pawan kalyan : రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టూర్ షెడ్యూల్ ఇదే ..!!

Tuesday, January 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కొండగట్టులోని ప్రఖ్యాత ఆంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. దీంతో పాటు తన ప్రచార రథం వారాహితో పాటు ఇతర వాహనాలకు పవన్ కల్యాణ్ పూజలు చేయించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. 24వ తేదీ ఉదయం పవన్ హైదరాబాద్ నుంచి బయల్దేరి 11 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. అక్కడ ఆంజనేయస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వారాహి, ఇతర వాహనాలకు పవన్ పూజలు చేయిస్తారు.

తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనున్న పవన్ :

అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జనసేన ముఖ్యనేతల సమావేశం నిర్వహించనున్నారు. నాచుపల్లి శివారులోని బృందావన్ రిసార్ట్‌లో ఈ భేటీ జరగనుంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. అక్కడి నుంచి ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన)కు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టనున్నారు.

ఒంటరిగా వెళ్లి వీరమరణాలొద్దన్న పవన్ :

ఇదిలావుండగా.. వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక టీడీపీతో పొత్తుతో వెళ్తారా అన్న దానిపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేనాని భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం గత గురువారం జరిగిన యువశక్తి బహిరంగ సభలో పొత్తుకు సంబంధించి పవన్ క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదని.. తన గౌరవం తగ్గకుంటడా వుంటే పొత్తుల్లో ముందుకే వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. కుదరని పక్షంలో ఒంటరిగానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే ధైర్యం ఇస్తే ఖచ్చితంగా అలాగే బరిలోకి దిగుతానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నా వెంటే వున్నామని అంటారని.. తీరా ఎన్నికల సమయానికి కులమని, మతమని, అమ్మ, నాన్న చెప్పారని ఓటు వేరేవారికి వేస్తారని పవన్ తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.