close
Choose your channels

'జెర్సీ' బాలీవుడ్ రీమేక్‌కి రంగం సిద్ధం

Monday, October 14, 2019 • తెలుగు Comments

జెర్సీ బాలీవుడ్ రీమేక్‌కి రంగం సిద్ధం

ఈ ఏడాది తెలుగు చిత్రం `అర్జున్ రెడ్డి`ని హిందీలో `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. తెలుగు మాతృక‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. హిందీ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేశారు. హిందీలో ఈ చిత్రం రూ.300కోట్ల‌ను వ‌సూలు చేసి ఈ ఏడాది అతి పెద్ద హిట్ చిత్రంగా బాలీవుడ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్పుడు షాహిద్ మ‌రో తెలుగు రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు. తెలుగులో నాని హీరోగా రూపొందిన ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ మూవీ `జెర్సీ`. ఈ సినిమా విడుద‌లైన‌ప్ప‌టి నుండే బాలీవుడ్‌లో రీమేక్ చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. అన్న‌ట్లుగానే ఈ రీమేఖ ఖ‌రారైంది. తెలుగు నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, దిల్‌రాజు, అమ‌న్ గిల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తెలుగులో జెర్సీ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన గౌత‌మ్ తిన్న‌నూరే ఈ రీమేక్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ కానున్నాయి. వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ 28న ఈసినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ సినిమా కోసం షాహిద్ క‌పూర్ రూ.40 కోట్ల రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశాడ‌ని, నిర్మాత‌లు అందుకు అంగీక‌రించార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం `క‌బీర్‌సింగ్‌` మేనియా ఈ రీమేక్ బిజినెస్‌కు ప‌నికొస్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. మ‌రి జెర్సీ రీమేక్ బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz