close
Choose your channels

K Raghavendra Rao:ఆర్ఆర్ఆర్‌పై కామెంట్స్.. ఆ 80 కోట్ల ఖర్చుకి నీ దగ్గర లెక్కలున్నాయా  : తమ్మారెడ్డికి రాఘవేంద్రరావు చురకలు

Friday, March 10, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోగా తెరకెక్కిన ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రం పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా మారుమోగుతోన్న సంగతి తెలిసిందే. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకోవడంతో పాటు ఇప్పుడు ఏకంగా ఆస్కార్ రేసులో నిలిచి ఔరా అనిపించుకుంది ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ బరిలో నిలిచింది. దీంతో టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు మద్ధతుగా నిలిచింది. అనేక సెలబ్రెటీలు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అటు ఆర్ఆర్ఆర్ యూనిట్ మొత్తం అమెరికాలో సందడి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్కార్ కొట్టి తీరాలన్న కసితో జక్కన్న పనిచేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మీడియాతో పాటు హాలీవుడ్ ప్రముఖులతో రాజమౌళి భేటీ అవుతున్నారు. అలాగే హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.

80 కోట్లతో 8 సినిమాలు తీయొచ్చన్న తమ్మారెడ్డి భరద్వాజ:

ఇలాంటి పరిస్ధితుల్లో దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డ్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ఖర్చు పెడుతున్న మొత్తంతో 8 సినిమాలు తీయొచ్చంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణం కోసం రూ.600 కోట్ల బడ్జెట్ అయ్యిందని.. మళ్లీ ఇప్పుడు ఆస్కార్ దక్కించుకునేందుకు చిత్ర యూనిట్ రూ.80 కోట్లు ఖర్చు చేసిందన్నారు. విమాన టికెట్లు, అమెరికాలో బస, ఇతర ఖర్చుల కోసం అంత వెచ్చిస్తున్నారని.. ఈ మొత్తతం 8 సినిమాలు చేయొచ్చని తమ్మారెడ్డి చురకలంటించారు. దీనిపై నందమూరి, మెగా అభిమానులతో పాటు నెటిజన్లు భగ్గుమన్నారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఇష్టం లేదా అంటూ వారు మండిపడుతున్నారు.

గర్వపడాల్సింది పోయి ఆ మాటలేంటీ :

ఈ క్రమంలో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా తమ్మారెడ్డి భరద్వాజ తీరు పట్ల గుర్రుగా వున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా వివాదాలకు దూరంగా, మౌన మునిలా వుండే దర్శకేంద్రుడు కే .రాఘవేంద్రరావు సైతం స్పందించారంటే తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఏ స్థాయిలో ప్రభావం చూపాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ మేరకు రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మిత్రుడు భరద్వాజ్‌కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి.. అంతేకానీ 80 కోట్లు ఖర్చు అంటూ నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వుందా..? , జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ వంటి వారు డబ్బు తీసుకుని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా..’’ అంటూ నిలదీశారు. దీంతో రాఘవేంద్రరావు ట్వీట్‌కి నెటిజన్ల నుంచి , ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ నుంచి గట్టి మద్ధతు లభిస్తోంది. మరి రేపు ఇంకెంతమంది సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు బాటలో విరుచుకుపడతారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.