close
Choose your channels

క‌ళ్యాణ వైభోగ‌మే రిలీజ్ డేట్

Monday, February 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యువ హీరో నాగ శౌర్య న‌టించిన తాజా చిత్రం క‌ళ్యాణ వైభోగ‌మే. ఈ చిత్రాన్ని అలా...మొద‌లైంది చిత్రంతో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ నంద‌నీ రెడ్డి తెర‌కెక్కించారు. రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ పై దామోద‌ర ప్ర‌సాద్ నిర్మించారు. ఈ చిత్రంలో నాగ శౌర్య స‌ర‌స‌న మాళ‌విన నాయ‌ర్ న‌టించారు. పెళ్లైన కొత్త‌లో...భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న్ జ‌ర్నీని స‌రికొత్త‌గా చూపిస్తున్నార‌ట నందినీ రెడ్డి.

ఇక రిలీజ్ విష‌యానికి వ‌స్తే... ఈ చిత్రాన్ని ముందు జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ అనుకున్నారు. మ‌ళ్లీ కుద‌ర‌లేదు. ఫైన‌ల్ గా క‌ళ్యాణ వైభోగ‌మే చిత్రానికి ముహుర్తం కుదిరింది. మార్చి 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి డేట్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రం పంపిణీ హ‌క్కులు అభిషేక్ పిక్చ‌ర్స్ సొంతం చేసుకోవ‌డంతో ఈ సినిమాపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రి...క‌ళ్యాణ వైభోగ‌మే ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుందో మార్చి 4న తెలుస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.