close
Choose your channels

హిందీ 'కాంచ‌న' టైటిల్‌

Sunday, April 21, 2019 • తెలుగు Comments

హిందీ కాంచ‌న టైటిల్‌

న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు.. ఇలా త‌నకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు రాఘ‌వ లారెన్స్‌. హార‌ర్ కామెడీలో పంథాలో `ముని` సిరీస్ ట్రెండ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సిరీస్ కార‌ణంగా రాఘ‌వ లారెన్స్ హార‌ర్ కామెడీ చిత్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయ్యారు. తెలుగు, త‌మిళంలో ఈ సిరీస్‌లో నాలుగో భాగం ..`కాంచ‌న 3`(ముని 4) ఏప్రిల్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. త‌నకు ద‌ర్శ‌కుడిగా చాలా గొప్ప పేరు తెచ్చిన ఈ సిరీస్‌తో రాఘ‌వ లారెన్స్ బాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. 

2011ఏడాదిన‌ తెలుగు, త‌మిళంలో `కాంచ‌న‌` విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. దీని  హిందీ రీమేక్‌లో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ హిందీ రీమేక్‌కు `ల‌క్ష్మి` అనే టైటిల్‌ను నిర్ణ‌యించార‌ని స‌మాచారం. `కాంచ‌న‌`లో రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తే.. క‌థ‌కు కీల‌క‌మైన హిజ్రా పాత్ర‌లో శ‌రత్‌కుమార్ న‌టించి మెప్పించారు. మ‌రిప్పుడు బాలీవుడ్‌లో రెండు పాత్ర‌ల్లో అక్ష‌య్ కుమారే న‌టిస్తాడా.. లేక శ‌ర‌త్‌కుమార్ పాత్ర‌కు మ‌రేవ‌రినైనా తీసుకుంటారో  తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

 

Get Breaking News Alerts From IndiaGlitz