close
Choose your channels

దసరా కానుకగా 'కంచె'

Friday, October 16, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందిన చిత్రం కంచె`. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు. కంచె వాయిదా ప‌డింది అక్టోబ‌ర్ 2కు బ‌దులు ఈ సినిమాను న‌వంబ‌ర్ 6న విడుద‌ల చేయాలనుకున్నారు. దీపావ‌ళిని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌ర్ 6న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని యూనిట్ నిర్ణ‌యించింది. అయితే తాజాగా అఖిల్ చిత్రం విడుదల వాయిదా పడటంతో కంచె సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేయాలనుకుంటున్నారట. మరి అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.