close
Choose your channels

సమంత - నాగచైతన్య విడాకుల‌కు ఆ బాలీవుడ్ స్టారే కార‌ణం, వైరలవుతున్న కంగనా పోస్ట్‌లు

Sunday, October 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సమంత - నాగచైతన్య విడాకుల‌కు ఆ బాలీవుడ్ స్టారే కార‌ణం, వైరలవుతున్న కంగనా పోస్ట్‌లు

టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తెలుగు చిత్ర సీమతో పాటు దేశంలోని మిగిలిన ఇండస్ట్రీల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా వుండే వీరిద్ద‌రూ విడిపోవ‌డంపై సినీ జనాలు షాక్‌కు గురవుతున్నారు. ఇక అక్కినేని అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్య‌వ‌హారంపై బాలీవుడ్ అగ్ర కథానాయిక, ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ త‌న‌దైన శైలిలో స్పందించారు. స్త్రీ, పురుషుల సంబంధంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.

‘‘ఏదైనా జంట విడిపోయి విడాకులు తీసుకున్నారంటే అందులో ప్ర‌ధానంగా మ‌గాడిదే త‌ప్పంటూ కంగనా తేల్చారు. తాను సాంప్రదాయంగా మాట్లాడుతున్నాననుకోవచ్చు లేదా ఏదైనా తీర్పు చెబుతున్నాన‌ని అనుకోవ‌చ్చు. భగవంతుడు పురుషుడిని, స్త్రీ త‌యారు చేశాడు. వారి స్వ‌భావాలు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు మారుతుంటాయి. అయితే మ‌గ‌వాడు మాత్రం వేట‌గాడిలా ప్ర‌వ‌ర్తిస్తుంటాడు. అమ్మాయిల‌ను విప్పి పారేసే బ‌ట్ట‌లులాగా భావించే ఆలోచ‌న‌ల‌ను మానేయండి. వారికి మంచి స్నేహితుల్లాగా ఉండండి. వంద‌ల మందిలో ఓ స్త్రీ త‌ప్పుగా ఉండ‌వ‌చ్చునేమో. ఇలాంటి త‌ప్పుడు ఆలోచ‌న‌లకు మీడియా, అభిమానుల నుంచి ప్రోత్సాహం దొరుకుతుంది. వారు ఒక మహిళను త‌మ కోణంలో నుంచి అంచ‌నా వేసేస్తారు. గతంలో ఎన్న‌డూ లేని విధంగా దేశంలో విడాకుల సంస్కృతి పెరిగిపోయిందని కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేశారు.

నాగచైతన్య-సమంత విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ.. కంగన ఓ బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ని టార్గెట్ చేశారు. అతని కార‌ణంగానే ఓ ద‌క్షిణాది న‌టుడు విడాకులు తీసుకున్నారు. వీరిది నాలుగేళ్ల వివాహ బంధమని.. అంత‌కు ముందు పదేళ్లకు పైగా ప్రేమలో వున్నారని కంగనా తెలిపారు. అయితే స‌ద‌రు ద‌క్షిణాది న‌టుడు ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్‌తో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఆ ఉత్త‌రాది స్టార్ విడాకులు తీసుకోవ‌డంలో నిపుణుడిగా పేరు పొందాడని.. అత‌ని కార‌ణంగా చాలా మంది మ‌హిళ‌లు, పిల్ల‌లు జీవితాలు పాడ‌య్యాయి. నేను ఎవ్వరి గురించి చెబుతున్నానో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’ అని కంగనా వరుస పోస్ట్‌లు చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.