close
Choose your channels

'KCPD' (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్) చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Saturday, March 18, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామిడి శ్రీరామ్, తనీష్ అల్లాడి,ద్వారక విడియన్ (బంటి) ప్రియాంక నిర్వాణ,దివ్య డిచోల్కర్ నటీ నటులుగా కార్తీక్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం "KCPD" (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్) శర వేగంగా షూటింగ్ జరుపు కుంటుంది. అయితే యంగ్ & డైనమిక్ హీరో రామిడి శ్రీరామ్ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర హీరో రొమాంటిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అనంతరం హీరో రామిడి శ్రీరామ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది .

ఈ సందర్భంగా నిర్మాత కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. రామిడి శ్రీరామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మొదటి షెడ్యూల్ జరుపుకుంటున్న మా "KCPD" (కొంచెం చూసి ప్రేమించు డ్యూడ్ ) సినిమా కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో నటించిన నటీ నటులు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లా కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు మేము వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసే మంచి కథతో వస్తున్న మా సినిమాకు మీ సపోర్ట్ మీ ఆదరణ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.