close
Choose your channels

KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

Thursday, November 30, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్ధిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు మంత్రి కేటీఆర్ దంపతులు ఖైరతాబాద్‌లో, మంత్రి హరీశ్ రావు దంపతులు సిద్ధిపేటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

ఇక మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా ఆదిలాబాద్ - 41.88%, భద్రాద్రి - 39.29, హన్మకొండ 35.29, హైదరాబాద్ 20.79, జగిత్యాల 46.14, జనగామ 44.31, భూపాలపల్లి 49.12, గద్వాల్ 49.29, కామారెడ్డి 40.78, కరీంనగర్ 40.73, ఖమ్మం 42.93, కుమురం భీం 42.77, మహబూబాబాద్ 46.89, మహబూబ్ నగర్ 44.93, మంచిర్యాల 42.74, మెదక్ 50.80, మేడ్చల్ 26.70, ములుగు 45.69, నాగర్ కర్నూల్ 39.58, నల్గొండ 39.20, నారాయణపేట 42.60, నిర్మల్ 41.74, నిజామాబాద్ 39.66, పెద్దపల్లి 44.49, సిరిసిల్ల 39.07, రంగారెడ్డి 29.79, సంగారెడ్డి 42.17, సిద్ధిపేట 44.35, సూర్యాపేట 44.14, వికారాబాద్ 44.85, వనపర్తి 40.40, వరంగల్ 37.25, భువనగిరి 45.07 శాతంగా నమోదయ్యాయని వెల్లడించారు.

చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

మరోవైపు ఆదిలాబాద్ పట్టణంలో విషాదం నెలకొంది. ఓటెయ్యడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. మావలకు చెందిన తోకల గంగమ్మ (78) ఓటేసేందుకు బూత్ వద్దకు రాగా పిట్స్ వచ్చాయి. ఆస్పత్రికి తరలించే లోపే ఆమె మృతి చెందింది. అలాగే, భుక్తాపూర్ కు చెందిన రాజన్న (65) ఓటేసేందుకు లైన్లో నిలబడి స్పృహ కోల్పోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు.

ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 5:30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో సాయంత్రం 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి ఉండగా.. తాజాగా దానిని సవరించింది. దీంతో 5.30గంటలకే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.