close
Choose your channels

KCR- Rahul Gandhi:కేసీఆర్ ఎత్తులకు కాంగ్రెస్ పైఎత్తులు.. రంగంలోకి రాహుల్ గాంధీ..

Saturday, December 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధమైంది. ఫలితాలపై ఇటు ప్రజలతో పాటు అన్ని పార్టీల నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు తమదే గెలుపని మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. పూర్తి మెజార్టీ రాకపోతే అభ్యర్థులను ఎలా కాపాడుకోవాలనే దానిపై మేథోమధనాలు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను కాపాడుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా అధిష్టానమే రంగంలోకి దిగింది. ఇందుకోసం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన ఇప్పటికే హైదరబాబాద్ చేరుకున్నారు.

మేజిక్ ఫిగర్ రాకపోతే అభ్యర్థులను కేసీఆర్ తన వైపునకు లాక్కొనే ప్రయత్నాలు చేస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోని కొందరితో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ హైకమాండ్ 49 కౌంటింగ్ కేంద్రాల్లో ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. మరోవైపు పార్టీ అభ్యర్దులను వెంటనే హైదరాబాద్ రావాలని సూచించింది. నగరంలోని తాజ్‌ కృష్ణ హోటల్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, సూర్జేవాలా పాల్గొననున్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వీరు హైదరాబాద్‌లోనే ఉండి కేసీఆర్ వ్యూహాలను నిశితంగా గమనించనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్, ఫలితాలు, గెలిచిన వెంటనే సీఎల్పీ సమావేశం, హంగ్ వస్తే ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతలకు దిశా నిర్దేశంచేశారు. అధికారానికి కావాల్సిన పూర్తి మెజార్టీ వస్తే సరే.. అటు ఇటుగా సీట్లు వస్తే మాత్రం హుటాహుటిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. ఈ మేరకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మేజిక్ ఫిగర్ వచ్చి అభ్యర్థులను ఇక్కడే ఉంచుతారా..? అభ్యర్థుల క్యాంప్ తరలింపు ఉంటుందా..? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.