close
Choose your channels

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

Thursday, August 6, 2020 • తెలుగు Comments

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

అల‌నాటి సావిత్రి జీవిత‌గాథ‌ను ‘మ‌హాన‌టి’ పేరుతో రీమేక్ చేస్తే అందులో సావిత్రి రూప‌ను త‌ల‌పిస్తూ అద్భుతంగా న‌టించిన కీర్తి సురేశ్‌కు నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కింది. ఈ చిత్రం త‌ర్వాత కీర్తిసురేశ్ పాత్ర‌లు, సినిమాల ఎంపిక‌లో అచి తూచి ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఈమె లిస్టులో మ‌రో సూప‌ర్‌హిట్ మూవీ సీక్వెల్ చేర‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. నాలుగు ద‌శాబ్దాల క్రితం కమ‌ల్ హాస‌న్‌, శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా భార‌తీరాజా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సూప‌ర్‌హిట్‌ చిత్రం ‘ఎర్ర‌గులాబీలు’. ఇప్పుడు ఈ సూప‌ర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ రూపొంద‌నుందని వార్త‌లు వినిపిస్తున్నాయి.

సూప‌ర్‌హిట్ సీక్వెల్‌లో కీర్తిసురేశ్‌..?

భార‌తీరాజా త‌న‌యుడు మ‌నోజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారని స‌మాచారం. శ్రీదేవి పాత్ర‌లో కీర్తిసురేశ్ న‌టించ‌నున్నార‌ట‌. మ‌రి క‌మ‌ల్‌హాస‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టించ‌నున్నారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సీక్వెల్ క‌థ‌ను భార‌తీరాజా అందిస్తున్నార‌ని టాక్‌. అంతే కాకుండా.. ఈ సీక్వెల్‌కు భార‌తీరాజానే నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని స‌మాచారం. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయట‌. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌వుతాయ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz