close
Choose your channels

కీర్తి మరో చిత్రం కూడా డిజిటల్ బాటలోనే!!

Wednesday, August 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కీర్తి మరో చిత్రం కూడా డిజిటల్ బాటలోనే!!

‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి సురేశ్‌కు ఆ రేంజ్ పాత్ర త‌ర్వాత రాలేద‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత చేసిన చిత్రాలేవీ కీర్తి సురేశ్‌లోని న‌ట‌న‌ను ఎలివేట్ చేసేలా లేవ‌నే చెప్పాలి. ఇప్పుడు కీర్తి కిట్టీలో ‘గుడ్ ల‌క్ స‌ఖితో పాటు మిస్ ఇండియా, స‌ర్కారువారి పాట‌’, ఓ మ‌ల‌యాళం చిత్రం ఇలా ఉన్నాయి. మ‌రికొన్ని చిత్రాల క‌థ‌ల‌ను కీర్తి వింటున్నారు. కాగా.. లాక్‌డౌన్ స‌మ‌యంలో చాలా వ‌ర‌కు సినిమాలు ఓటీటీ బాట ప‌ట్టాయి. అలా ముందు సినిమాల‌కు ఓటీటీలోకి రావ‌డానికి కాస్త ధైర్యాన్ని ఇచ్చిన చిత్రం పెంగ్విన్‌. కీర్తిసురేశ్ న‌టించిన ఈ చిత్రం త‌ర్వాత మ‌రికొన్ని సినిమాలు కూడా ఓటీటీలో సంద‌డి చేశాయి. ఇప్పుడు కీర్తిసురేశ్ టైటిల్ పాత్ర పోషించిన మ‌రో సినిమా కూడా ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైందట‌.

ఆ సినిమా ఏదో కాదు.. ‘గుడ్ ల‌క్ స‌ఖి’ అని టాక్‌. త్వరలోనే ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను రిలీజ్ చేస్తుందని సమాచారం. జాతీయ అవార్డు విన్న‌ర్ న‌గేశ్ కుకునూర్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్‌గా న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌.. సినిమా ప్ర‌ధాన క‌థాంశ‌మేంటో చెప్ప‌క‌నే చెప్పేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.