close
Choose your channels

'కిక్ 2' మూవీ రివ్యూ

Friday, August 21, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మనం బాగుండటం కాదు, పక్కవాడి కోసం తపన పడటంలో అసలైన కిక్ ఉందని చెప్పిన చిత్రం కిక్`. ఏడేళ్ల క్రితం మాస్ మహారాజా రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ కిక్` చిత్రం రవితేజ కెరీర్ లో వన్ ఆప్ ది బెగ్టెస్ట్ కమర్షియల్ సక్సెస్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్ తో పాటు కళ్యాణ్ రామ్ వంటి అన్ కాంప్రమైజ్ డ్ ప్రొడ్యూసర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వంటి బ్యానర్ వాల్యూతో కిక్-2` రూపొందింది. కిక్ కావాలంటూ కిక్` చిత్రంలో చేలరేగిన రవితేజ కిక్2` లో కంఫర్ట్ గా ఉండాలంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మన ఆ కంఫర్ట్ లోని కిక్ ను కిక్-2` రూపంలో ప్రేక్షకులకు అందించాడా? లేదా? అని తెలియాలంటే సినిమా సమీక్షలోకి వెళ్లాల్సిందే...

కథ

కిక్కు దొరకాలనే వెతికే కళ్యాణ్(రవితేజ) చివరికి అమెరికా సెటిల్ అవుతాడు. అతని స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ కళ్యాణ్ కృష్ణ(కిక్ శ్యామ్)అతన్ని కలవడానికి అమెరికాకి వస్తాడు. ఆ సందర్భంలో కిక్ తన కొడుకు రాబిన్ హుడ్(రవితేజ) గురించి శ్యామ్ కి చెప్పడంతో సినిమా అసలు కథలో వెళుతుంది. రాబిన్ హుడ్ తన కంఫర్ట్ చూసుకునే స్వార్థమున్న మనిషి. అమెరికాలో హాస్పిటల్ కట్టడానికి డబ్బు అవసరమై హైదరాబాద్ లోని తన తాత ఆస్థిని అమ్మేయడానికి ఇండియా వస్తాడు. కానీ తన ఆస్థిని డి.డి(ఆశిష్ విద్యార్థి) కబ్జా చేశాడని తెలుసుకుని అతని నుండి ఇంటి పత్రాలు సంపాదించే పనిలో ఉంటాడు. మరో వైపు ఇండియాలోని విలాస్ పూర్ లో మైనింగ్ వ్యాపారం చేసే సాల్మన్ సింగ్ ఠాగూర్(రవికిషన్) అక్కడ ప్రజలను భయభ్రాంతులను చేసి ఎదిరించిన వారందరినీ చంపేస్తుంటాడు. అతనికి భయపడి గ్రామస్థులు వారిని కాపాడే వ్యక్తి కోసం ఎదురుచూస్తుంటారు. ఇండియా వచ్చిన రాబిన్ హుడ్, పండిట్ రవితేజ(బ్రహ్మానందం) ఇంట్లో అద్దెకు దిగుతాడు. రవితేజను నానా రకాలు హింసిస్తాడు. ఈ క్రమంలో రాబిన్ హుడ్ కి ఛైత్ర(రకుల్ ప్రీత్) పరిచయం అవుతుంది. ఆమెకి రాబిన్ హుడ్ ప్రవర్తన నచ్చిందని ఓ రోజు ఐలవ్ యూ చెబుతుంది. అయితే తాను తనని తప్ప ఎవరినీ ప్రేమించడం లేదని, వీలైతే ఛైత్రను నన్ను ప్రేమించుకో తప్ప, ప్రేమించమని అడగవద్దనే కండీషన్ పెడతాడు. ఆ కండీషన్ పై ఛైత్ర రాబిన్ హుడ్ తో స్నేహితురాలిలా మెలుగుతుంటుంది. తన ఆస్థి పని పూర్తి కాగానే రాబిన్ హుడ్ అమెరికాకి ప్రయాణం అవుతాడు. ఆ సందర్భంలో తనకు తెలియకుండానే తాను ఛైత్ర ప్రేమలో పడిపోయినట్లు గ్రహిస్తాడు. తన ప్రేమ చెప్పే ప్రయత్నంలో కొందరు ఛైత్రను కిడ్నాప్ చేస్తారు. ఛైత్ర కోసం రాబిన్ హుడ్ ఆమె ఊరికి బయలుదేరుతాడు. అసలు ఛైత్ర ఎవరు? రాబిన్ హుడ్ ను ఎందుకు ప్రేమిస్తుంది? అసలు విలాస్ పూర్ గ్రామస్థులకు, రాబిన్ హుడ్ కి సంబంధం ఏమిటి? సాల్మన్ సింగ్ ఠాగూర్, రాబిన్ హుడ్ పాత్రలు చివరికి ఏమౌతాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్ పాయింట్స్

ఇందులో చెప్పుకోవాల్సిందే రవితేజ నటన, సినిమా కథకు తగిన విధంగా తండ్రి, కొడుకు పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా కంఫర్ట్ కోసం ఆలోచించే పాత్రలో ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని లీడ్ చేశాడు. ఈ గమనంలో తన ఎనర్జీ లెవల్స్ ఎక్కడా డ్రాప్ కాలేదు. తనదైన మార్కు నటననతో ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గానే కనపడుతూ మంచి పెర్ ఫార్మెన్స్ పరంగా బాగా నటించింది. పాటల్లో మంచి లుక్స్ తో కనిపించింది. రవికిషన్ విలనీజం బాగుంది. మిడిల్ ఏజ్ డ్ విలన్ గా మంచి నటనను కనపరిచాడు. ఇక మెయిన్ గా చెప్పుకోవాల్సింది సెకండాఫ్ లో సంజయ్ మిశ్రా నటన బాగుంది. పండిట్ రవితేజగా బ్రహ్మానందం తన స్టయిల్ ఆఫ్ కామెడితో నవ్వించాడు. రాజ్ పాల్ యాదవ్ పాత్ర పరిమితమే అయినా చక్కగా నటించాడు. పోసాని కృష్ణమురళి, కోవై సరళ, సమీర్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ బావుంది. కథను ఎక్కడా లాగకుండా ముందుకు నడిపించాడు. థమన్ తీస్ మార్ ఖాన్... సాంగ్, ఈ తేనె కళ్లది ప్రేమల్లో పడ్డది.. మమ్మీకడుపులోన.. సాంగ్స్ బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ప్రతి సీన్ చాలా క్లియర్ గా, ఫ్రెష్ లుక్ తో చూపించాడు. మేకింగ్ వాల్యూస్ బావున్నాయి.

మైనస్ పాయింట్స్

రవితేజ్ లుక్స్ పరంగా బాగా కనపడలేదు. చాలా డల్ గా కనపడ్డాడు. సినిమా సెకండాఫ్ లో గ్రామస్థులు చేసే కామెడి పెద్ద నవ్వు తెప్పించదు. ఎవరో వ్యక్తి హైదరాబాద్ లో గొడవ చేస్తే అతను నేషనల్ వైడ్ రాజకీయాలను శాసించే విలన్ తో గొడవ పడటానికి సరిపోతాడని ఎలా అనుకుంటారనే లాజిక్ అర్థం కాలేదు. కామెడి పర్సంటేజ్ కిక్ తో పోల్చితే చాలా తక్కువ. ఎడిటింగ్ లో సినిమాని ఇంకాస్తా కత్తరించి ఉండవచ్చు.

విశ్లేషణ

కిక్ అంటే పక్కవాడి కోసం బతకడం. కిక్-2 అంటే తన కంఫర్ట్ తాను చూసుకోవడం. కంఫర్ట్ అంటే తను మాత్రమే బాగుండాలని కాకుండా తన చుట్టూ ఉండేవారు కూడా బాగుండాలనుకోవడమే చివరికి హీరో తెలుసుకుని న్యాయం కోసం పోరాడుతాడు. ఈ పాయింట్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి తన స్టయిల్ ఆఫ్ టేకింగ్ ముందుకు తీసుకెళ్లాడు, అయితే కిక్ అనే టైటిల్ పెడుతున్నప్పుడు ఆ సినిమా రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందనుకుని వెళ్లే వారికి నిరాశ తప్పదు. కామెడి పెద్ద లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్. థమన్ మ్యూజిక్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయి. మనమంతా ఒక్క ఠాగూర్ కి భయపడితే, వాడొక్కడు వందమంది ఠాగూర్ లను భయపెడతాడు...ఠాగూర్ మన ఊరికి శాపం, రాబిన్ ని మోసం చేస్తే పాపం కూడా వస్తుంది. ఈ ఊరిలో ఇంతకు ముందు కొడుకు తండ్రిని చంపడం చూశాను. ఇప్పుడు తండ్రి కొడుకుని చంపడం చూస్తున్నాను. ఈ ఊరి జాతకం మారబోతోంది.. ,చివర్లో రాబిన్ హుడ్ గ్రామస్థులతో మీరు ప్రేమగా మోసం చేశారా, మోసం చేసి ప్రేమించారా...అంటూ వచ్చే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే కమలాభాయ్, రాబిన్ హుడ్ ల మధ్య నడిచే ఎమోషనల్ సీన్, చికెన్ కోసం గ్రామస్థుడు కుక్కతో పోట్లాడటం, అందరూ గ్రామస్థులు రాబిన్ హుడ్ ని సంతోష పెడతూ, వారు మాత్రం బాధ పడే సన్నివేశాలు, ప్రీ క్లయిమాక్స్ లో తనికెళ్ల భరణి రవితేజ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి.

బాటమ్ లైన్: కిక్-2` అలరించే మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్

రేటింగ్: 3.25/5

English Version Review

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.