close
Choose your channels

సోనూసూద్ గురించి కోన వెంకట్ చెప్పిన విషయాలు వింటే షాకవుతారు..

Tuesday, July 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోనూసూద్ గురించి కోన వెంకట్ చెప్పిన విషయాలు వింటే షాకవుతారు..

ప్రముఖ నటుడు సోనూసూద్ గురించి ప్రముఖ దర్శకుడు, రచయిత కోనా వెంకట్ పలు ఆసక్తికర విషయాలు.. షాక్‌కు గురించే విషయాలను వెల్లడించారు. ఓ చర్చా కార్యక్రమంలో సోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనా వెంకట్ ఫోన్ ద్వారా పలు విషయాలను వెల్లడించారు. సోనూ అసలు టీ కూడా తాగరు.. ఒక్క దురలవాటు కూడా లేదని కోనా వెంకట్ వెల్లడించారు. ‘‘నిన్ను వదల బొమ్మాళి’ అనగానే అందరికీ సోనూసూద్ గుర్తొస్తాడు. ఇప్పుడు కూడా ఆపదలో.. అవసరంలో ఉన్నవారిని వదలకుండా వెతుక్కుంటూ వెళ్లి సాయం చేయడం చాలా గొప్ప. సోను ఇండస్ట్రీ మొత్తం గర్వపడేలా చేశారు. సోనూసూద్ సూపర్ మ్యాన్‌ను కూడా మించిపోయి ఒక స్థాయికి వెళ్లిపోయాడని ప్రముఖ దర్శకుడు, రచయిత కోనా వెంకట్ పేర్కొన్నారు.

ప్రజలు నిన్ను ఆన్ స్క్రీన్‌పై కూడా నిన్ను ఓ స్టార్‌గా.. హీరోగానే చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ఇక మీదట మిమ్మల్ని మేము విలన్‌గా చూపిస్తే జనం మమ్మల్ని చెప్పులతో కొడతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క రైటర్‌కి నీకు కథ రాయడం ఒక ఛాలెంజ్. సోనూ చాలా డిసిప్లెయిన్‌గా.. సైలెంట్‌గా ఉంటారు. సోనూ కనీసం టీ కూడా తాగడు. ఒక్క దురలవాటు కూడా లేదు. తన పక్కన ఎవరైనా సిగిరెట్ తాగినా పిలిచి క్లాస్ తీసుకుంటారు. స్క్రీన్‌పైనే విలన్.. నిజ జీవితంలో ఆయనకు విలన్‌లో కనిపించే ఒక్క లక్షణం కూడా కనిపించదు. ఎదుటి వారికి కష్టమొస్తే కనీసం సొంతవారే స్పందించారు. అలాంటి సోనూ స్పందిస్తున్న తీరు హర్షనీయం’’ అని కోనా వెంకట్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.