close
Choose your channels

Konda Surekha:రాహుల్ గాంధీ యాత్రలో కొండా సురేఖకు తప్పిన పెను ప్రమాదం

Thursday, October 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖకు పెద్ద ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో సురేఖ పాల్గొన్నారు. ఈ ర్యాలీకి వేలాది మంది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సురేఖ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో ఆమె ముఖం, చేతులకు గాయాలయ్యాయి. తక్షణమే ఆమెను హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. ముఖం కుడి భాగంతో పాటు చేతులు, కాళ్లుకు స్వల్ప గాయాలయ్యాయన్నారు. ఆమె తలకి దెబ్బ తగలడంతో కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సురేఖ గాయపడిన విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడ్డ భార్యను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.

బైక్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఇందులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీనియర్‌ నేత మధుయాష్కీతో పాటు మరికొందరు ముఖ్యనేతలు పాల్గొన్నారు. జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా రెండో రోజు రాహుల్‌ గాంధీ పర్యటన భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగింది.

దొరల తెలంగాణ... ప్రజల తెలంగాణకు మధ్య పోటీ..

కాటారం జంక్షన్‌లో రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణ... ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని.. పదేళ్ల నుంచి ఒకే కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని రాహుల్ ఆరోపించారు. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెడుతున్నారని.. కానీ కేసీఆర్‌పై ఒక్క కేసు కూడా లేదన్నారు. బీజేపీ-ఎంఐఎం పరస్పర సహకారం అందించుకుంటున్నాయని.. అలాగే పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతోందని రాహుల్ వెల్లడించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.