close
Choose your channels

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందర్నీ ఆకట్టుకుంటున్న క్షణం.

Tuesday, March 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
భారీ చిత్రాల‌ను నిర్మిస్తున్న పి.వి.పి సంస్థ కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ క్షణం. అడవిశేష్,ఆదాశర్మ, అనసూయ భరద్వాజ. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన క్ష‌ణం చిత్రాన్నినూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించారు. ఇటీవ‌ల రిలీజైన క్ష‌ణం సినిమా సామాన్యుల‌నే కాదు సెల‌బ్రిటీల‌ను కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో
హీరో రానా మాట్లాడుతూ... క్ష‌ణం సినిమాని బ‌న్ని, నేను క‌ల‌సి చూసాం. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాల‌కే క్ష‌ణం తో క‌నెక్ట్ అయిపోయాను. థ్రిల్ల‌ర్ ఫార్మెట్ తో తీసినా తెలుగు నేటివిటీ ఎక్క‌డా మిస్ కాకుండా చాలా బాగా తీసారు. ఈ క‌థ మ‌న‌కు ఎందుకు దొర‌క‌లేదు అనిపించింది. అలాగే సినిమాతో నాకు సంబంధం లేదు. ఒక‌ సినిమా ల‌వ‌ర్ గా ఈ సినిమాని గురించి మాట్లాడాలి అనిపించింది. తెలుగులో ఇలాంటి సినిమాలు త‌క్కువ వ‌స్తున్నాయి. మ‌రెన్ని సినిమాలు రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ సూర్య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ...ఈ సినిమా చూడ‌డం ప్రారంభించిన 15 నిమిషాల‌కు డైరెక్ట‌ర్ ఎవ‌రు ఇంత మెచ్యూర్డ్ గా ఆలోచించాడు అనిపించింది. ఇంగ్లీషు పిక్చ‌ర్ చూస్తే ఎలాంటి ఫీలింగ్ క‌లుగుతుందో అలాంటి ఫీలింగ్ క‌లిగింది. శేషు, ఆదాశ‌ర్మ‌, అన‌సూయ‌, వెన్నెల కిషోర్, రాజేష్...ఇలా ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియ‌న్స్ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేసారు. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే ఫుల్ క్రెడిట్ పి.వి.పి కి చెందుతుంది అన్నారు.
అడ‌వి శేషు మాట్లాడుతూ...ఈ సినిమా చూసిన త‌ర్వాత బ‌న్ని, రానా, ర‌కుల్ ప్రీత్ సింగ్ రెస్టారెంట్ కి పిలిచి ఈ సినిమా గురించి డిస్క‌స్ చేయ‌డం చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. క్ష‌ణం ఆడియో ఫంక్ష‌న్ కి రానా ని గెస్ట్ గా పిల‌వాల‌నుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. ఇప్పుడు రానా మా సినిమా గురించి మాట్లాడ‌డం సంతోషంగా ఉంది. క‌ల‌లో కూడా ఇంత బిగ్ హిట్ అవుతుంద‌ని ఊహించ‌లేదు అన్నారు.
నిర్మాత పి.వి.పి మాట్లాడుతూ...రానా చెప్పిన‌ట్టు మూవీ ల‌వ‌ర్స్ త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్ర‌మిది. క్ష‌ణం సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందంటే కార‌ణం టీమ్ వ‌ర్క్. ఒక సంవ‌త్స‌రం పాటు వ‌ర్క్ చేయ‌డం వ‌ల‌నే ఇంత మంచి సినిమా వ‌చ్చింది అనేది నా అభిప్రాయం. ఇక నుంచి ఇలాగే మంచి సినిమాలు నిర్మించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను అన్నారు.
మంచు ల‌క్ష్మి మాట్లాడుతూ...తెలుగులో ఇలాంటి సినిమా చూసినందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సినిమాతో నాకు సంబంధం లేక‌పోయినా మాట్లాడుతున్నాను అంటే కార‌ణం అంత బాగా న‌చ్చింది. ఈ సినిమాని అంద‌రూ చూడాలి.మంచి సినిమాని స‌పోర్ట్ చేస్తున్న పి.వి.పి మ‌రిన్ని సినిమాలు నిర్మించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అన‌సూయ‌, రాజేష్, డైరెక్ట‌ర్ ర‌వికాంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.