close
Choose your channels

ధృవ వేడుకకు కె.టి.ఆర్..చిరు డౌటే..

Wednesday, November 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ధృవ‌గా సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైపోయాడు. ఈ సినిమా కోసం అటు మెగాభిమానులు, ఇటు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగానే గ‌మ‌నిస్తున్నారు. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి రికార్డ్ ఉన్న రాంచ‌ర‌ణ్ ఇప్పుడు ధృవ‌తో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలనుకుంటున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్ర‌క‌టించిన రోజు నుండే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఎందుకంటే మ‌గ‌ధీర వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత రాంచ‌ర‌ణ్‌, గీతార్ట్స్ బ్యాన‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూవీ `ధృవ` కావ‌డంతో అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. అంద‌రి అంచ‌నాల‌కు మించుతూ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, సాంగ్స్ స‌హా రీసెంట్‌గా విడుద‌లైన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు `ధృవ` ఆడియెన్స్ నుండి అద్భుత‌మైన రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంటుంది. విడుద‌లైన ఇరవై నాలుగు గంట‌ల్లోనే మిలియ‌న్ వ్యూస్‌ను రాబట్టుకున్న `ధృవ‌` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఇప్ప‌టికి నాలుగు మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను రాబ‌ట్టుకుంది. హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేస్తున్నారు.

అంత కంటే ముందుగా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కులు, మెగాభిమానుల స‌మ‌క్షంలో డిసెంబ‌ర్ 4న హైదరాబాద్ యూస‌ఫ్ గూడ పోలీస్ లైన్స్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ వేడుక‌కు తెలంగాణ ఐటీ మినిష్ట‌ర్ కె.తారక‌రామారావు హాజ‌ర‌వుతున్నార‌ట‌. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌వుతార‌నే దానిపై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఎందుకంటే చిరు ఖైదీ నంబ‌ర్ 150 చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నారు. కాబ‌ట్టి చిరు హాజ‌రు విష‌యం చివ‌రి నిమిషంలోనే ఖ‌రార‌య్యే అవ‌కాశాలున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.