close
Choose your channels

జులై 19న ద లైన్ కింగ్ సూప‌ర్‌స్టార్స్ వాయిస్ ల‌తో విడుద‌ల‌

Thursday, July 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జులై 19న ద లైన్ కింగ్ సూప‌ర్‌స్టార్స్ వాయిస్ ల‌తో విడుద‌ల‌

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు.

అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ విజువ‌ల్ వండ‌ర్ కి ర‌విశంక‌ర్‌, జ‌గ‌ప‌తిబాబు, నాని, ల‌ప్సికా, ఆలీ, బ్ర‌హానందం వాళ్ళ గాత్రాల‌ను అందించారు. ల‌య‌న్ కింగ్ లో కీల‌క పాత్రైన ముసాఫాకు ర‌విశంక‌ర్‌, ఇక ముసాఫా త‌న‌యుడు సినిమాకు హీరో పాత్రైన శింబాకు నాని డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. జ‌గ‌ప‌తిబాబు స్కార్‌, లిప్సికా నాళా, బ్ర‌హానందం పుంబా, ఆలీ టిమోన్ పాత్ర‌ల‌కు వాళ్ళ వాయిస్‌ని అందించారు. ఈ చిత్రం జులై 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో...

లైవ్ యాక్ట‌ర్స్ కి ఏమాత్రం తీసిపోకుండా సింహ‌లు న‌టించాయి...

ర‌విశంక‌ర్ మాట్లాడుతూ... నాకు ఈ వాయిస్ దేవుడు ఇచ్చిన వ‌రం. నాన్న‌గారి నుండి వ‌చ్చిన ఈ వాయిస్ ని చాలా చిత్రాల‌కి చెప్పాను. మాములుగా మ‌నుషుల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం చాలా కామ‌న్ కాని మొద‌టిసారి ఒక ల‌య‌న్‌కి చెప్ప‌డం. ఆ ఎమోష‌న్స్‌ని వాటిని క్యారీ చెయ్య‌డానికి నాకు ఈ చిత్ర యూనిట్ ఎంతో స‌హాయ‌ప‌డ్డారు. లైవ్ ఆర్టిస్టులు కంటే చాలా బాగా సింహ‌లు నటించాయి అనేలా డిస్ని వారి వ‌ర్క్ వుంది. నా డ‌బ్బింగ్ కి చాలా ఎమెష‌న్ వుంది. ఫాద‌ర్ అండ్ స‌న్ మ‌ద్య వచ్చే సీన్ నాకు రియ‌ల్ లైఫ్ లో వున్న ఎమెష‌న్ ఇక్క‌డ వ‌ర్క‌వుట్ అయింది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

ప‌నికిరాని వాయిస్ డిస్ని వ‌ర‌కూ వెళ్లింది.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ... ఒక‌ప్పుడు సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌ల్లో నా వాయిసే నాకు మైన‌స్ అన్నారు. కానీ ప్ర‌స్తుతం నా వాయిస్ న‌న్ను ఎక్క‌డికో తీసుకువెళుతుంది. ఇలా డిస్నీ నుంచి నాకు అవ‌కాశం రావ‌డం నా పూర్వ‌జ‌న్మ‌సుకృతంగా చెప్పాలి. ప్ర‌స్తుతం న‌న్ను హాలీవుడ్‌, బాలీవుడ్లో కూడా ప్రేక్ష‌కులు బాగా ఆద‌రిస్తున్నారు. ఇక ర‌విశంక‌ర్ వాయిస్ అంటే పీక్స్ అనే చెప్పాలి అలాంటిది నా వాయిస్ మొద‌ట్లో సెట్ అవ్వ‌దు అనుకున్నాను. ఇక నాని గురించి చెప్పాలంటే చాలా బాగా చెప్పాడు నేచ‌ర‌ల్‌గా ఉంటుంది. నానితో క‌లిసి త‌ర్వాత న‌టించాల‌ని కూడా ఉంది . తెలుగు సినిమా ప్ర‌పంచ దేశాల్లో ప్రేక్ష‌కుల‌కి చేరుతుంది. మ‌న తెలుగు సినిమా అనేలా మార్పు వ‌స్తుంది. చాలా ఆనందంగా వుంది. అని అన్నారు.

నా కొడుకు ని లైన్‌కింగ్ తెలుగు వెర్ష‌న్ కి తీసుకెళ్తా.. వాడి కోస‌మే ఈ సినిమా చేశా...

నాని మాట్లాడుతూ... నాకు ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన డిస్నీ వాళ్ళ‌కి నా కృత‌జ్ఞ‌త‌లు. రాజ‌మౌళి చిత్రంలో ఈగ‌కి డ‌బ్బింగ్ చెప్పాల‌నుకున్నా కానీ అందులో ఈగ‌కి మాట‌లు ఉండ‌వు దాంతో నా కోరిక తీర‌లేదు. అ చిత్రం ద్వారా చేప‌కు, ద లైన్ కింగ్ ద్వారా సింహానికి చెప్పే అవ‌కాశం దొరికింది. చాలా హ్యాపీ. మొదట్లో చాలా భ‌యం వేసింది. ఎందుకంటే ర‌విశంక‌ర్‌, జ‌గ‌ప‌తిబాబుల వాయిస్ ముందు నా వాయిస్ ప‌నికొస్త‌దా అనుకున్నా ముందు వాళ్ళు చెప్పిన రెండు సీన్స్‌కి డ‌బ్బింగ్ విన్నా. త‌ర్వాత నేను చెప్పాను. అలాగే మేము ఎంత చెప్పినా ఏం చేసినా బ్ర‌హ్మానందంగారు, ఆలీగారు ఉంటేనే సినిమా అంతా చాలా స‌ర‌దాగా ఉంటుంది. వాళ్ళిద్ద‌రూ ఈ చిత్రంలో మెయిన్ అని చెప్పాలి. వాళ్ళ క్యారెక్ట‌ర్ వ‌స్తే చాలు ప్రేక్ష‌కులు బాగా ఆనంద‌ప‌డ‌తారు అని అన్నారు. మామూలుగా ఇంగ్లీష్ సినిమా అంటే అంద‌రూ ఎక్కువ‌గా డ‌బ్బింగ్ కంటే ఇంగ్లీష్ చూడ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. మొద‌ట్లో నేను కూడా నా కొడుకుని ఇంగ్లీష్‌కి తీసుకువెళ‌దాం అనుకున్నా కానీ ఇప్పుడు సినిమా చాలా బాగా రావ‌డంతో తెలుగు వ‌ర్ష‌న్‌కే తీసుకువెళ‌తా. ఈ సినిమా రెగుల‌ర్‌గా ఉండే మూవీ కాదు. రెగ్యుల‌ర్ డిస్నీ మూవీ కాదు చాలా బావుంటుంది. మీరంద‌రూ ఫ్యామిలీస్‌తో వ‌చ్చి చూస్తే తెలుస్తుంది అని అన్నారు.

డిస్ని చిత్రాలు చూడాల‌నుకునే నాకు వారితో ప‌నిచేసే ఛాన్స్ వ‌చ్చింది.

ఆలీ మాట్లాడుతూ... ఒక ప‌క్క ర‌విశంక‌ర్‌గారు మ‌రో ప‌క్క‌జ‌గ‌ప‌తిబాబుగారు అంటేనే స్టేజ్ అదిరిపోతుంది. ఇక వాటి మ‌ధ్య మా వాయిస్ అంటే చాలా క‌ష్టం అనుకున్నా అలాగే వాళ్ళు చాలా ప‌క్కాగా డ‌బ్బింగ్‌కి కూడా అగ్రిమెంట్ రాయించుకుని మ‌రీ ప్ర‌తీ చిన్న చిన్న మాడ్యులేష‌న్ కూడా చాలా జాగ్ర‌త్త‌గా చేయించారు. సినిమా అంతా చాలా బాగా వ‌చ్చింది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి. ఇక జ‌గ‌ప‌తిబాబుగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న ఎన్నో సినిమాల్లో న‌టించారు. ప్రొడ్యూస్ చేశారు. వారి నాన్న‌గారు కూడా ఎన్నో విజ‌యాలు చూశారు. బాలీవుడ్‌లో ఒక‌ప్పుడు అమితాబ‌చ్చ‌న్ ఎలాగో మ‌న టాలీవుడ్‌కి జ‌గ‌ప‌తిబాబు అలాగే టాలీవుడ్ అమితాబ‌చ్చ‌న్ అన్నారు. ఇక‌పోతే బ్ర‌హ్మానందంగారి గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు 1300కి పైగా చిత్రాల్లో న‌టించారు. ఎంతో మందికి డ‌బ్బింగ్ చెప్పారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాష‌ల‌కు డ‌బ్బింగ్ చెప్పారు. ఎంతో గొప్ప‌వారు. ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల‌సింది ఏమీ లేదు అన్నారు.

నా వాయిస్ సాప్థ గా వుంటుంది ప‌నికిరాదేమో అనుకున్నా..

లిప్సిక మాట్లాడుతూ.. హీరోయిన్ కొ.. మ‌రో పాత్ర‌ల‌కొ డ‌బ్బింగ్ చెప్పిన‌వ్పుడు చాలా ఈజీగా వుండేది.. ఇక్క‌డ సింహ‌నికి చెప్పాలి.. ఎలా అని అనుకుంటున్న టైంలో డిస్ని వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈ పాత్ర‌కి అన్ని భాష‌ల్లో సూప‌ర్‌స్టార్స్ చేప్పారు. తెలుగు లో నాతో చెప్పించ‌డానికి కార‌ణం ఎంటో తెలియ‌దు కాని ఇది నా అదృష్ణం గా భావిస్తున్నాను. అని అన్నారు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment