close
Choose your channels

నితిన్ చిత్రంలో లిజీ పాత్ర ఎలా ఉంటుందంటే..

Wednesday, March 21, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నితిన్ చిత్రంలో లిజీ పాత్ర ఎలా ఉంటుందంటే..

నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన సినిమా 'ఛల్ మోహన్ రంగ'. పవన్ కళ్యాణ్, సుధాకర్ రెడ్డి నిర్మాతలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కథా ర‌చయిత కాగా.. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. గ్రామీణ నేప‌థ్యంలో సాగే అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రంగా ఈ సినిమా రూపొందింద‌ని స‌మాచారం.

ఇదిలా ఉంటే..  ఉగాది సందర్భంగా ఈ సినిమా ఆడియో జ్యూక్ బాక్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఆల్బంలో వచ్చే "వారం" పాటని వింటే.. ఈ సినిమాలో హీరోయిన్ మేఘా ఆకాష్ పాత్ర‌కి.. అలాగే ఆమె తల్లి పాత్ర‌కి  పొగరుంటుంద‌నే సెన్స్ ఉంటుంది.

ఆ తల్లి పాత్రలో ఒకప్పటి క‌థానాయిక‌ లిజి కనిపించనున్నార‌ని సమాచారం. గతంలో త్రివిక్రమ్, నితిన్ కలయికలో వచ్చిన ‘అఆ’ కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథే కావడం విశేషం. ఆ చిత్రంలో కూడా పొగరుబోతు అత్త (నదియా) పాత్ర తెరపై సందడి చేసింది.

ఆ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. త్రివిక్ర‌మ్ క‌థ‌తోనే వ‌స్తున్న ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.