close
Choose your channels

పిక్ చూసి హీరో ఎవరో కనుక్కోగలరా?

Monday, September 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లాక్‌డౌన్ తరువాత మన హీరోల పిక్ పెట్టి.. ఎలాంటి హింట్ ఇవ్వకుండా ఎవరో కనుక్కోండి అంటే కొందరిని గుర్తించగలం కానీ.. కొందరినైతే సమస్యే లేదు. చాలా కష్టం. ఎవరికి వారు న్యూ గెటప్స్ ట్రై చేశారు. అయితే హీరోల్లో గడ్డం, తలపై జుట్టు పెంచిన వారే ఎక్కవ. చిరు మాత్రం వీరికి భిన్నంగా గుండుతో కనిపించారు. మరి వీరంతా వారి అప్‌కమింగ్ సినిమాల కోసం ఈ న్యూ గెటప్స్ ట్రై చేస్తున్నారో.. లేదంటే అలా అయితే ఎలా ఉంటామో చూసుకుందామని ట్రై చేశారో కానీ ఎవరికే వారే అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

తాజాగా నారా వారి అబ్బాయి రోహిత్ న్యూ గెటప్‌లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. రోహిత్‌ను కనుక్కోవడమైతే చాలా కష్టం. తన ట్విట్టర్ ఖాతాలో వచ్చింది కాబట్టి కనుక్కోగలిగాం. నారా రోహిత్ న్యూ గెటప్ కూడా ఆకట్టుకుంటోంది. అంతే కాదు.. ఆ పిక్ చూస్తుంటే నారా వారి అబ్బాయి చాలా తగ్గినట్టు కూడా అనిపిస్తోంది. మొత్తమ్మీద మన హీరోలు లాక్‌డౌన్‌ను అద్భుతంగా యూజ్ చేసుకున్నారు. హీరో సుధీర్‌బాబు సిక్స్ ప్యాక్‌లో కనిపించగా.. బన్నీ కూడా వండర్‌ఫుల్ గెటప్‌తో కెమెరా కంటికి చిక్కాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.